ప్రతీ సీజన్ లోనూ మాటీవీ తరపున సీరియల్ నటులు, ఎంకర్ లు, వివిధ ప్రోగ్రామ్ లలో కనిపించేవాళ్ళు బిగ్ బాస్ లోకి వెళుతున్నా ప్రత్యేకంగా ఎవరూ చూడలేదు. అయితే గత సీజన్ 7 లో SPY బ్యాచ్, SPA బ్యాచ్ అంటూ రెందువర్గాలుగా విడిపోయి నానా హంగామా చేసుకున్నారు. మాటీవీ నుంచి వెళ్ళిన వారిని ప్రత్యేక గ్రూప్ గా ట్రీట్ చేస్తూ వాళ్ళపై విమర్శలు గుప్పించడం, గొడవలు పడడం లాంటివి ఎన్నో చేవారి సీజన్ లో జరిగాయి. చివరకు హోస్ట్ నాగార్జున కూడా స్పై బ్యాచ్, స్పా బ్యాచ్, చుక్క బ్యాచ్ అంటూ తన వారాంతర ప్రోగ్రామ్ లలో ప్రస్తావించడంతో ఓటింగ్ చేసేవాళ్ళు కూడా ఇలా బ్యాచ్ ల వారీగా విడిపోయారు.
అయితే ఇప్పుడు మా టీవీ తరపున హౌస్ లోకి వెల్లనవయే చుక్క బ్యాచ్ ఎవరు అనేది ఆసక్తి గా మారింది. రేపు (సెప్టెంబర్ 1) ప్రారంభం అయ్యే బిగ్ బాస్ సీజన్ 8 లో ఇటీవలే ముగిసిన “కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్” అనే ప్రోగ్రామ్ నుంచి కొందరిని తీసుకున్నారు. ఒక నలుగురు అయితే పక్కాగా చుక్క బ్యాచ్ గా రాబోతున్నారు. ఇంకా ఎవరు వస్తారు అనేది త్వరలో తెలియనుంది.
పక్కాగా హౌస్ లోకి అడుగుపెట్టే మా బ్యాచ్ లో స్టార్ మా సీరియల్ యాక్టర్ నిఖిల్ మలియక్కల్, యాంకర్ విష్ణుప్రియ. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో కృష్ణగా తనదైన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి ప్రెరానా కంబమ్, ఆర్జే శేఖర్ బాషాఉన్నారు.
బిగ్ బాస్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అన్నా.. ప్రతీరోజూ విశ్లేషణలు చదవాలి అన్నా ఈవేళ వాట్స్అప్ చానల్ ను ఫాలో అవండి.