అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌తో కుదుర్చుకున్నారు.
‘నాన్ ముదలవన్’ అనే పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 20 లక్షల మంది యువ సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాలిన్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ స్టార్టప్‌లు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో భాగస్వామ్యంలో ఈ ఒప్పందం సహాయపడుతుంది. దీనితో పాటు, గూగుల్ యొక్క పిక్సెల్ 8 మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ స్థాపన, గూగుల్ ఉత్పత్తులు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది” అని తమిళనాడు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా తన పర్యటనలో స్టాలిన్ ఇవాళ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కార్యాలయాలను సందర్శించారు. తమిళనాడులో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై ఈ కంపెనీలతో చర్చించారు. దీన్ని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, స్టాలిన్, ‘వివిధ అవకాశాలు మరియు భాగస్వామ్యాల గురించి చర్చించాం. కంపెనీలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాం. తమిళనాడును ఆసియాలోనే అభివృద్ధి ఇంజిన్‌గా నిర్మించాలి’ అని అన్నారు.
An awe-inspiring visit to the offices of Apple, Google and Microsoft. Discussed various opportunities and exciting partnerships. Determined to strengthen these partnerships and make Tamil Nadu one of the foremost growth engines of Asia!@TRBRajaa @Guidance_TN @TNIndMin… pic.twitter.com/mQJzKwm0J2
— M.K.Stalin (@mkstalin) August 31, 2024