ఏప్రిల్ 22న భారత్‌కు రావాల్సి ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యటన రద్దయ్యింది. ఆయన తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉంది. ఈ పర్యటనలో టెస్లా పెట్టుబడుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని భావించారు. దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారని, టెస్లా కార్ల ప్లాంట్ భారత్‌లో ఏర్పాటుచేస్తారనే ప్రచారం సాగింది. తాను ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని ఈనెల 10న ఎక్స్ లో ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా అయిన Xలో ఈ విషయంపై ఒక పోస్ట్ చేశారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార మీటింగులు ఉన్నకారణంగా దురదృష్టవశాత్తూ ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.
Unfortunately, very heavy Tesla obligations require that the visit to India be delayed, but I do very much look forward to visiting later this year.
— Elon Musk (@elonmusk) April 20, 2024
నిజంగా పని ఒత్తిడుల వల్లనే ఎలాన్ మస్క్ తన పర్యటన వాయిదా వేసుకున్నారా లేక దానికి రాజకీయ కారణాలు ఉన్నాయా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.