మే 13 నుండి 19 వరకు జరగాల్సిన AP EAPCET 2024 ఇంజనీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2024 పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేసింది. కృతట షెడ్యూల్ ప్రారం ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష మే 18 నుండి 23, 2024 వరకు జరుగుతుంది.
అయితే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ పరీక్షలు యధాతధంగా మే 16 మరియు 17 తేదీల్లో జరుగుతాయి. ఆలస్య రుసుముతో రూ. 1,000 మే 5 వరకు అప్లై చేసుకోవచ్చు , మే 4 నుండి 6 వరకు ధరఖాస్తుల సవరణకు అవకాశం ఇచ్చారు. ఇకపోతే, హాల్ టిక్కెట్లు మే 7న డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2024కి రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.తుది తేదీ ముగిసేనాటికి 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 82,258 మంది ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్–ఫార్మా విభాగాలకు కలిపి మరో 1,085 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ దరఖాస్తులు రాలేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 8 వేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి.