ఒకవైపు విజయవాడ నగరం వరదల్లో మునిగి ఉంది.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యంపై అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి మంత్రులు కానీ, నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఏడుపదుల వయసులో చురుకుగా తిరుగుతున్న చంద్రబాబు మినహా లోకేష్, పవన్ కళ్యాణ్ తో సహ యువ నాయకులెవరూ ఎక్కడున్నారో కూడా తెలీడం లేదు.
ఒకవైపు అధికారుల వైఫల్యం .. మరోవైపు ప్రజల తిట్లు చంద్రబాబులో అసహనాన్ని పెంచుతున్నాయి. వరదల పై రోజూ సమీక్షలు చేసి నిజాలు తెలుసుకుంటున్న చంద్రబాబు అటు తర్వాత పెడుతున్న ప్రెస్మీట్ లలో ఆ అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు.
నిజానికి గుడ్లవల్లేరు అంశం విజయవాడలో వరదలు వచ్చే ముందే ముగిసింది.. అప్పటికే కొన్ని టిడిపి చానల్స్ “కేటుగాళ్ళు.. కిట్టు గాళ్ళు ఈ ఘోరంలో ఉన్నరేమో” అంటూ పేర్ని నాని కుమారుడు కిట్టు చేసినట్లుగా వ్యాఖ్యానించాయి.. అయినా సరే వైసీపీ ఈ అంశాన్ని పెద్దది చేయలేదు. ఒకవైపు ఈ కేసుని ఏక పక్షంగా ముగించేసినా ఒక్క వైసీపీ నాయకుడు కూడా తీవ్రంగా స్పందించలేదు. అయినా ఈనాటి ప్రెస్ మీట్ లో చంద్రబాబు ఆ విషయంలో వైసీపీని దుమ్మెత్తి పోశారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకున్న బోట్ల వెనక కూడా వైసీపీ ఉంది అని అనుమానంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంటే కాదు ఇప్పటి దాకా రాష్ట్రంలో జరిగిన ధారుణాలు అన్నింటికీ జగన్ కారణం అన్నట్లు .. ఆఖరుకి హాస్టల్ లలో ఫుడ్ పాయిజనింగ్ కూడా వైసీపీ పని అన్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా కోర్టులు కూడా నిర్ధారించని వివేకానందరెడ్డి హత్య వెనక కూడా జగన్ ఉన్నాడు అన్నట్లుగా నిందలు వేశారు.
ఇన్ని తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబు ఏ ఆధారాలతో చేస్తున్నారు అనేది మాత్రం తెలీదు. చంద్రబాబు గారికి నిజంగా వైసీపీ ఈ సంఘటనలు అన్నిటి వెనుకా ఉంది అని అనిపిస్తే ఋజువులు చూపించి నెమ్మదిగా చెప్పినా చాలు.. ప్రజలు ఆ పార్టీపై ఉమ్మి వేస్తారు..
ఒకవేళ బాబు గారు చెప్పినవన్నీ ఉత్తుత్తి ఆరోపణలు అయితే మాత్రం జగన్ కు జనంలో మరింత మద్దతు రావడం ఖాయం.