ఇజ్రాయెల్ ప్రభుత్వం భవన నిర్మాణరంగంలో మరో 15000 ఉద్యోగాలను భారతీయుల కోసం కేటాయించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం దృష్ట్యా ఇప్పటిదాకా 10000 భారతీయులను ఉద్యోగాలలో నియమించుకుంది ఆ దేశం. అయితే వారిలో 500 మందిని సరైన నైపుణ్యం లేని కారణంతో వెనక్కి పంపబోతోంది. జాతీయ నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా నీ నియామాకాలు జరుపుతోంది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్దం మొదలైన తర్వాత దాదాపు 90000 మంది పాలస్తీనియన్లను ఉద్యోగాల నుంచి తొలగించి తమ దేశం నుంచి పంపించి వేసింది ఆ దేశం. గత నవంబర్ లో భారత్ తో భారతీయులకు ఉద్యోగాల కల్పనకు ఒక ఒప్పందం చేసుకుంది.
దీని ద్వారా ఇప్పటి వరకు నియమించిన 10000 మందిలో ఉత్తర ప్రదేశ్, తెలంగాణా, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువమంది ఆ దేశంలో ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు తీసుకోబోతున్న 15000 ఉద్యోగాలలో 10,000 నిర్మాణరంగంలోకాగా 5000 ఉద్యోగాలు సేవారంగంలో కల్పించబోతోంది.