Allu Arjun: జానీ మాస్టర్ బాధితురాలికి సపోర్ట్? పవన్ ఫాన్స్ గుస్సా

Jani Master Issue: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ లైగింక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఆయనపై ఓ మహిళా కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేయడం .. ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చక చకా జరిగిపోయాయి.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో బాధితురాలిగా అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాను నటించే తర్వాతి చిత్రాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే సినిమాల కోసం పని చేసేందుకు ఆ మహిళా కొరియోగ్రాఫర్‌కు అవకాశాలు ఇస్తామని మేనేజర్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారనే విషయం వ్యాప్తి చెందుతోంది.. ఆ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అటు మెగా అభిమానులు.. జనసేన అభిమానులు అల్లు అర్జున్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీని టార్గెట్ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఈరోజు జానీ మాస్టర్ కేసు విషయంలో టాలీవుడ్ లైగింక వేధింపుల పరిష్కార ప్యానెల్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. యాంకర్ ఝాన్సీ ఈ విషయంపై కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఓ పెద్ద హీరో.. బాధితురాలికి పని విషయంలో భరోసా ఇచ్చారని చెప్పారు. దీనితో జానీ మాస్టర్ కి .. తద్వారా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పని చేస్తున్నారని నమ్ముతున్న ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు..

అయితే, ఈ విషయంపై అల్లు అర్జున్ నుంచి కానీ.. ఆయన తరపున కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Join WhatsApp Channel