హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంఎస్/ ఎండీ/ డీఎన్బీ అర్హత కలిగిన అభ్యర్థులు వివిధ పోస్టుల ప్రకారం షెడ్యూల్ తేదీలలో ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.67,700/- నుండి రూ.2,45,295/- వరకు ప్రతినెల వేతనం పొందుతారు. వివరాల్లోకి వెళితే ..
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు:
- ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) – 39,
- సీనియర్ రెసిడెంట్ – 31.
విభాగాలు :
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఎంఎస్/ ఎండీ/ డీఎన్బీ మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
వయసు: 06.09.2024 నాటికి 45 – 67 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు రూ.67,700/- నుండి రూ.2,45,295/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలు భర్తీకి ఎలాంటి రాత పరీక్ష ఉంటుంది.
- అకడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ, రాత పరీక్ష స్కోర్, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన వారు నేరుగా తమ బయోడేటా/ రెజ్యూమ్ తో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీలు :
- పోస్టులను అనుసరించి, సెప్టెంబర్ 19, 20, 21, 23, 24, 25 వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సనత్ నగర్ హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.esic.gov.in/
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి