హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిన్న (సోమవారం) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంలో యాంకర్, కార్తిని లడ్డు కావాలా నాయన.. మరో లడ్డు కావాలా అని సరదాగా ప్రశ్నించగా కార్తీ బదులిస్తూ ” ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అది, మనకి వద్దు లడ్డు, అసలు లడ్డు టాపిక్ వద్దు’ అని నవ్వుతూ బదులిచ్చాడు.
అయితే ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ “కొందరు హీరోలు సినిమా ఈవెంట్స్ లో లడ్డు పై జోకులు వేస్తున్నారు .. లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అంటున్నారు .. ఆ హీరోలను నేను గౌరవిస్తాను కానీ ఇది బాధించే విషయం .. మీరు మద్దతు ఇస్తే ఇవ్వండి .. లేదంటే మౌనంగా ఉండండి .. అంటే కానీ కామెంట్స్ చేయకండి” అన్నారు
నిన్న ఒక సినిమా ఫంక్షన్లో లడ్డు మీద జోకులు వేస్తున్నారు @PawanKalyan @JanaSenaParty pic.twitter.com/NHUBOsIDtB
— Prasannakumar Nalle (@PrasannaNalle) September 24, 2024