భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) దేశవ్యాప్తంగా పలు సెక్టార్లలో ట్రేడ్, ఇతర విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా తెలుగు వారికి రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలలోని ఓఎన్‌జీసీ సంస్థలో 129 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ, స్టైఫండ్ ఇస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 206
కాకినాడ పరిధిలో -76 ఖాళీలు
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 2
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 23
- సెక్రటేరియల్ అసిస్టెంట్- 2
- డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 2
- ఎలక్ట్రీషియన్- 11
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 4
- ఫిట్టర్- 11
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 6
- మెకానిక్ డీజిల్ – 2
- మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 5
- ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్)- 8
రాజమండ్రి పరిధిలో -53 ఖాళీలు
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 4
- సెక్రటేరియల్ అసిస్టెంట్ 4
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2
- ఎలక్ట్రీషియన్ -8
- ఫిట్టర్- 15
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ -2
- లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) -3
- వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 1
- ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
- మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (గ్రాడ్యుయేట్)- 1
- మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
- ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్) -10
- ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్- 1
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్
విభాగాలు : వివిధ ఓఎన్జీసీ విభాగాలు (ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, సర్వేయర్, మెషినిస్ట్,అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, స్టోర్ కీపర్)
అర్హత: అభ్యర్థులు పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థులు వయోపరిమితి 25.10.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు అంటే అభ్యర్థి పుట్టిన తేదీ 25.10.2000 -25.10.2006 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులుకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
స్టైఫండ్:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – B.A / B.Com / B.Sc / B.B.A/B.E./B.Tech – రూ. 9,000
- మూడు సంవత్సరాల డిప్లొమా- ఇంజినీరింగ్ లో సంబంధిత విభాగం – రూ.8,050
- ట్రేడ్ అప్రెంటిస్‌లు -10వ/12వ – రూ.7,000
- ట్రేడ్ అప్రెంటీస్- ఐటిఐ ట్రేడ్ (ఒక సంవత్సరం) -రూ.7,700
- ట్రేడ్ అప్రెంటిస్- ఐటిఐ ట్రేడ్ (రెండు సంవత్సరాల వ్యవధి) -రూ.8,050
ఎంపిక విధానం: అడమిక్స్‌లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 25 మధ్యలో ఓఎన్జీసీ వెబ్‌సైట్ www.ongcapprentices.ongc.co.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 25
ఫలితాలు/ఎంపిక తేదీ : నవంబర్ 15
వెబ్‌సైట్: www.ongcindia.com
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి