Dussehra 2024: శ్రీ మహాలక్ష్మీ దేవిగా అమ్మవారి దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆరవ రోజైన మంగళవారం నాడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత ఈరోజు రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

శరన్నవరాత్రులలో అమ్మవారిని మహాలక్ష్మీ దేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు అనేకమంది భక్తులు దేవస్థానానికి విచ్చేస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని పండితులు చెపుతున్నారు.

ఏ రంగు దుస్తులతో అమ్మవారిని దర్శించుకోవాలి?

ఆరోరోజైన ఈరోజు శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్తసహితంగా సకల ఉపచారాలు జరిపించి, అర్చించుకుని, పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదిస్తే మంచిది. అలాగే అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో శుభప్రదం అని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఈరోజున గులాబీ వ‌ర్ణం ధ‌రిస్తే మంచిద‌ని ఆయన చెప్పారు.

దుర్గా మంత్రం

యాదేవీ సర్వ భూతేషు విష్ణు మాయేతి శబ్దిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు చేతనేత్య విధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు నిద్రా రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు క్షుధా రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శక్తిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు తృష్ణ రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు క్షాంతిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు జాతి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు లజ్జా రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శాంతిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు కాంతిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు వృత్తి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వ భూతేషు తుష్టి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యాదేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఇంద్రియాణా మధిష్టాత్రి భూతానా చకిలేషుయా
భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః
చితీ రూపేణయా కృష్ణం అతత్ వ్యాప్తస్థితః జగత్
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

Join WhatsApp Channel