AP Toll Hike: ఏపిలో టోల్​ చార్జీల మోత షురూ..

ఇంకా రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు పడకముందే నేషనల్ హైవేలపై కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాహణదారులకు టోల్ చార్జీల మోత మోగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు చాలా టోల్ గేట్లలో ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న కాజా టోల్ గేట్ వద్ద అక్టోబర్ 25 వరకు 145 రూపాయలు ఉన్న కార్ టోల్ చార్జి ఇప్పుడు 240 కి చేరింది. వెళ్లేటప్పుడు 160 రూపాయలు, వచ్చేటప్పుడు 80 రూపాయలుగా పెంచారు.

రాష్ట్రంలో పిపిపి మోడల్ లో రాష్ట్ర రోడ్లు అభివృద్ది చేసి టోల్ గేట్లు పడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రణాళిక ఇంకా మొదలవ్వక ముందే ఇలా ప్రస్తుతం ఉన్న టోల్ గేట్లలో చార్జీల మూత మొగిస్తుండడం వాహనదారులకు భారంగా మారింది.

ఏపి వ్యాప్తంగా ఉన్న 69 టోల్ గేట్లలో 65 చోట్ల ఛార్జీలు డిసెంబర్ 15 నుంచి దాదాపు రెట్టింపయ్యాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఉన్న కీసర, నెళ్లవరు-చెన్నై మధ్య ఉన్న వెంకటాచలం, బుదనం, సూళ్లూరుపేట టోల్ గేట్లకు మాత్రం రేట్ల పెంపులో మినహాయింపు ఇచ్చారు.

రానున్న కొద్ది రోజుల్లో సాధారణ ప్రయాణికులకు కూడా చార్జీల మోత మొగనుంది. ఇది భవిష్యత్ లో ఈ భారం వివిధ సరుకుల ధరలపై కూడా పడనుంది.

Join WhatsApp Channel