లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు పృధ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.. పృధ్వీ చేసిన ప్రసంగం జగన్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.. ఒక్కసారిగా #BoycottLailaMovie అనే ట్యాగ్ తో ట్విట్టర్ లో వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. దీనికి స్పందించిన లైలా హీరో విష్వక్సేన్, జరిగిన డానికి తాను క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలను సినిమాపై చూపకండి అని అభ్యర్ధించారు. అయితే పృధ్వీ క్షమాపణలు చెప్పకపోతే తాము సినిమాని ఆడనివ్వం అంటూ జగన్ అభిమానులు వైసీపీ సోషల్ మీడియా హెచ్చరించింది.
ఆతర్వాత హాస్పిటల్ లో చేరిన పృధ్వీ మరిన్ని తీవ్ర కామెంట్లతో వైసీపీ సోషల్ మీడియా #BoycottLailaMovie, #BoycottLaila ట్యాగ్ లతో మరింత విరుచుకుపడింది .. మరో వైపు మెగా, విష్వక్సేన్, జనసేన అభిమానులు #WeSupportLaila అంటూ వారు కూడా ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా లైలా సినిమాకి పబ్లిసిటీ కోసమే విష్వక్సేన్ ఇలాంటి వివాదం మొదలు పెట్టారని వైసీపీ వాళ్ళు అంటుండగా .. తాను ఇప్పటికే క్షమాపణ చెప్పానని ప్రతీసారీ తగ్గలేనని.. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ మరోసారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
రెండు వర్గాల గొడవలో సినిమా ఫలితం ఏవిధంగా ఉండబోతోంది అని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతుండగా.. ట్విటర్ లో కూడా తాము సినిమా రిలీజ్ వరకూ తగ్గేదెలే అంటూ లక్షలాది ట్వీట్లతో విరుచుకు పడుతున్నారు.