Tesla to India: భారత్ లోకి వచ్చేస్తోన్న టెస్లా, నియామాకాలు మొదలు పెట్టిన సంస్థ

0
2
tesla-cars-to-india
tesla-cars-to-india
  • మోడీతో ఎలాన్ మస్క్ భేటీ తర్వాత ఊపందుకున్న ఎంట్రీ ప్రక్రియ.
  • లింక్డ్ ఇన్ లో నియామక ప్రకటనలు
  • ముంబై, డిల్లీ లలో 13 ఉద్యోగ నియామక ప్రకటనలు

ఎప్పటి నుంచో భారత్ ఎలెక్ట్రిక్ కార్ల మార్కెట్ లోకి అడుగుపెట్టాలని చూస్తోన్న టెస్లా ఇటీవలి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ తో భేటీ తర్వాత తన సన్నాహాలు మొదలెట్టింది. ప్రస్తుతం దేశంలో ఎలెక్ట్రిక్ కార్ల మార్కెట్ చిన్నదే అయినప్పటికీ భవిష్యత్లో అనేక అవకాశాలు ఉన్నాయని భావిస్తోన్న సంస్థ తన ప్రయత్నాలకు రూపు దిద్దే ప్రక్రియలో మొదటగా ఉద్యోగ నియామకాలు మొదలెట్టింది.

ముంబై, డిల్లీ లలో 13 మొదటి స్థాయి ఉద్యోగాల కోసం లింక్డ్ ఇన్ లో నియామక ప్రకటనలు ఉంచింది.

నిజానికి భారత్ ఎలెక్ట్రిక్ కార్ల మార్కెట్ లోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో టెస్లా చూస్తోన్న అధిక కస్టమ్ సుంకాల నేపధ్యంలో వెనకడుగు వేస్తూ ఉంది. అయితే ఇటీవలే అధిక ధరల కార్లపై దిగుమతి పన్నులను 110 శాతం నుండి 70 శాతానికి మోడీ సర్కారు తగ్గించింది. గత ఏడాది భారత్ లో దాదాపు ఒక లక్ష ఎలెక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కాగా మన పొరుగున ఉన్న చైనాలో 1.1 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. దీనితో చెప్పవచ్చు భారత్ లో విధ్యుత్ వాహనాల వినియోగం ఏ దశలో ఉందో!

అయితే గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా టెస్లా తన ఎలెక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో క్షీణత నమోదు చేసుకోంది. అయినా సరే భారత్ ఎలెక్ట్రిక్ కార్ల అమ్మకాలకు ఒక సువర్ణావకాశాల మార్కెట్ గా ఆ సంస్థ భావిస్తోంది.