జగన్ హత్యకు కుట్ర జరుగుతోందా? బద్రత తగ్గింపుపై తీవ్ర ఆందోళన

0
2

వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహనరెడ్డిని అంతమొందించాలని ప్రభుత్వ పెద్దలే ఆశిస్తున్నారా? ఎన్నికల తర్వాత ఇప్పటివరకూ జరుగుతున్న పరిణామాలు జగన్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోని అత్యంత జనాదరణ పొందిన నాయకుల లిస్టులో మాజీ సీయం జగన్ ప్రధమ వరుసలో ఉంటారు. గత ఎన్నికలో ఓడిపోయినప్పటికీ వోట్ల శాతంలో వైసీపీకి అన్ని పార్టీలకంటే ఎక్కువ ఓట్లే పడ్డాయి. దాదాపు 40 శాతం ఓటర్లు జగన్ కు మద్దతు పలికారు.

ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలను ఏలిన నాయకులలో తమదైన పధకాలతో ముద్రవేసిన ముఖ్యమంత్రులు కేవలం ముగ్గురే.. వారు ఎన్టీయార్, వైఎస్సార్, జగన్! గత పాలనలో తనదైన పథకాలతో ముద్రవేసిన వైఎస్ జగన్ ఘోరంగా ఓటమి పాలై తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా తెలుగదేశం పార్టీలో జగన్ పై భయం ఏమాత్రం తగ్గలేదు. ఏన్నికల్లో ఓడిపోయాడు కానీ బ్రతికే ఉన్నాడు కదా అని కొందరు, జగన్ ని చంపేయాలి అని కొందరు, చివరికి అధినేత స్థాయి వ్యక్తులు కూడా “ఇలాంటి వ్యక్తులను ఏలిమినేట్ చేయాలి” అనే పదాలు వాడారు.

ఒకవైపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక.. మరోవైపు జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణతో మళ్ళీ తదుపరి ఎన్నికలలో వైసీపీ తప్పక తిరిగి అధికారంలోకి వస్తుంది అని అటు అధికారులు, ఇటు పారిశ్రామికవేత్తలతో పాటు టిడిపి నాయకులు కూడా నమ్ముతున్నారు. జగన్ 2.0 లో తమ నాయకులు, కార్యకర్తలను వేధించిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని జగన్ చేసిన హెచ్చరిక అధికార వర్గాలను ఆందోళకు గురిచేస్తోంది. అందుకే అధికారులు కూడా వైసీపీ నాయకుల అరెస్టులు, నిర్బంధాలపై ఉదాసీనంగా ఉంటున్నారన్న అభిప్రాయం పాలకవర్గంలో ఉంది.

ఏన్నోసార్లు అధికారులను ముఖ్యమంత్రితో పాటు, టిడిపి మీడియా కూడా పేర్లతో సహా హెచ్చరించినా వారిలో చలనం కనపడడం లేదు. వయసు మీదకు వస్తున్న చంద్రబాబుకు ఎలాగైనా తన కుమారుడైన లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని, తెలుగుదేశం పార్టీని ఎదురులేని శక్తిగా రూపుదిద్దాలని ప్రణాళిక వేస్తున్నారు. అయితే హామీల అమలులో పడుతున్న ఇబ్బందులు ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని, మళ్ళీ జగన్ అధికారంలోకి రాకుండా చేయాలంటే ఆయన ప్రజల్లోకి రాకూడదు అని టిడిపి అధినాయకత్వం భావిస్తోంది. ధారుణ ఓటమి తర్వాత జగన్ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లోకి వివిధ సందర్భాలలో వస్తున్నారు. ఇది కూటమి నాయకులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

అందుకే జనాల్లోకి జగన్ రాకుండా భయపెట్టే వ్యూహాలు రచిస్తోంది.. భద్రత కుదింపు అనేది ఈ చర్యలలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో ఒకవైపు అభిమానుల తాకిడి కనిపించినప్పటికీ.. ఒక్క పోలీసు కూడా లేకపోవడం జగన్ హత్యకు వీలు కల్పించే చర్యలే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై వై ఎస్సార్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. జగన్ పర్యటనల్లో జరుగుతోన్న భద్రతాలోపాలను అటు గవర్నర్, ప్రధాని మోడీ దృష్టికి తీసుకురావడంతో పాటూ దేశవ్యాప్త చర్చకు తెరలేపాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్ భద్రతపై శ్రద్ద చూపకపోతే.. జగన్ కు ఏ ప్రమాదం జరిగినా అది ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ల మెడకు చుట్టుకోవడం ఖాయం.