Srisailam: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

0
2
Srisailam photo 2025
Srisailam photo 2025

శ్రీశైలంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈరోజు నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ దంపతులు స్వామివారిని దర్శించకున్నారు. అనంతరం 11:35 గంటలకు వారు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్ర గవర్నర్‌ దంపతులకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి, కర్నూలు జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ రాష్ట్ర గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

మహా శివరాత్రి అయిన బుధవారం నాడు శ్రీశైలంలో మల్లికార్జున, బ్రమరాంబ కల్యాణం, పాగాలంకరణ జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి కర్నూలు రేంజ్‌ డిఐజి డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ పరిశీలించారు. క్యూలైన్లు, గుడి పరిసరాలు, సిసి కెమెరాల కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

కాగా శ్రీశైలంలో భక్తిల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచి పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.