Mhow MP Attacks: భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవంపై దాడి!

0
2
attacked Jama Masjid in Mhow

మధ్యప్రదేశ్ లోని మోవ్ పట్టణంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో విజయోత్సవంలో పాల్గొన్నవారిపై కొందరు దాడి చేశారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక జామా మసీదు సమీపంలో బైక్ ర్యాలీపై వెళుతున్న వారిపై రాళ్ళతో దాడి చేశారు. ఇరు వర్గాలకు జరిగిన పరస్పర దాడిలో కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి వచ్చి పరీస్థితి చక్కడిద్దారు.

మోవ్ పట్టణం జిల్లా కేంద్రమైన ఇండోర్ కు 25 కిలోమీటర్ల దారంలో ఉంటుంది. ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడి పరిస్థితి అడుపులోనే ఉందని.. అదనపు పోలీసు దళాలను అక్కడికి పంపామని చెప్పారు.

పోలీసు డిఐజి నిమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..”కొందరు అల్లరి మూక భారత క్రికెట్ విజయోత్సవ ర్యాలీపై రాళ్ళు రువ్వడంతో హింస చెలరేగిందని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని” చెప్పారు.

source: PTI, మరియు కొన్ని మీడియా సంస్థల కధనాలు