భారత్ తన చంద్రయాన్-3 ని విజయవంతంగా చంద్రునిపై దింపిన తర్వాత జరిగిన ఒక బిబిసి చర్చా కార్యక్రమంలో ఒక ఏంకర్ లేవనెత్తిన సందేహం వీడియో సోషల్ లో చక్కర్లు కొట్టింది. ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ వీడియోని షేర్ చేస్తూ ఆ విలేఖరిపై తీవ్రంగా విడుచుకు పడ్డారు.
ఆ చర్చలో విలేఖరి భారత్ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రశ్నిస్తూ “దేశంలో 700 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నప్పుడు అంతరిక్ష కార్యక్రమానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా” అని ప్యానలిస్ట్‌ని అడగడం వీడియోలో చూడవచ్చు.
BBC యాంకర్ మాట్లాడుతూ, “కొంతమంది దీని గురించి ఆలోచిస్తున్నందున నేను మిమ్మల్ని అడుగుతున్నా.. భారతదేశం, చాలా మౌలిక సదుపాయాలు లేని దేశం, చాలా పేదరికం ఉన్న దేశం. 700 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయులకు టాయిలెట్ అందుబాటులో లేదని నేను భావిస్తున్నాను. నిజంగా, నిజంగా, వారు నిజంగా అంతరిక్ష కార్యక్రమంలో ఈ విధమైన డబ్బును ఎందుకు ఖర్చు చేయాలి?” అన్నాడు.
ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన మహింద్రా ధీటైన సమాధానం ఇచ్చారు. .
“నిజంగానా ?? నిజం ఏమిటంటే, చాలా వరకు, దశాబ్దాల పాటు సాగిన వలస పాలన మొత్తం ఉపఖండంలోని సంపదను క్రమపద్ధతిలో దోచుకుంది. దీని ఫలితం పేదరికం. వాళ్ళు మా విలువైన కోహినూర్ ని దోచుకుపోగలిగారు కానీ మా స్వంత సామర్థ్యాలపై మా గర్వం మరియు నమ్మకాలను కాదు. చంద్రునిపైకి వెళ్లడం మనకు ఏమి చేస్తుంది అంటే అది మన అహంకారం & ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఇది మా సాంకేతికత యొక్క అభివృద్దికి నమ్మకాన్ని కల్పిస్తుంది . మనల్ని మనం పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది.. ” అంటూ బిబిసికే కాక దేశంలో కొందరి విమర్శకులకు చెప్పుతో కొట్టిన సమాధానం ఇచ్చారు .. దటీజ్ మహింద్రా !
Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ
— anand mahindra (@anandmahindra) August 24, 2023