ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లకు దాదాపు 4 గంటల చార్జింగ్ అవసరం. ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 50 నుండి 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరి సుదూర ప్రయాణాలు చేసేవారు ఈ బైక్ లను కొనడానికి ఆసక్తి చూపక పోడానికి కారణం ఇదే … ప్రతీరోజూ ఇంట్లో చార్జింగ్ పెట్టి అది పూర్తీ అయ్యేవరకు వెయిట్ చెయ్యడం కాస్త విసుగ్గా ఉంటుంది.
ఇలా కాకుండా అక్కడక్కడా కనపడే పెట్రోల్ బ్యాంకుల్లో ఒక్క నిమిషంలో పెట్రోల్ కొట్టిస్తే ఇక ఎంతదూరం అయినా ప్రయాణం చేసుకుంటూ పోవచ్చు.
మరి ఇలాంటి పద్దతే ఎలక్ట్రిక్ స్కూటర్లకు వస్తే !!
అవును ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియాలో అడుగుపెట్టాయి. GOGORO పేరుతొ ఈ స్కూటర్లు డిల్లీ, మహారాష్త్ర లలో అడుగుపెట్టాయి. దారిపొడుగునా ఉండే బ్యాటరీ బంకుల్లో ఉచితంగా బ్యాటరీలు మార్చుతూ పోవచ్చు. నెలకు ఇంత అని చెల్లిస్తే ఎన్ని సార్లైనా బ్యాటరీలు మార్చుకుంటూ ప్రయాణించవచ్చు.
అంటే కాదండోయ్ మరో శుభవార్త ఏంటి అంటే కొనేటప్పుడు ఈ స్కూటర్లలో బ్యాటరీలు ఉండవు. దీనితో వీటి ధర ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నవాటితో పోలిస్తే దాదాపు సగం మాత్రమె ఉంటుంది.
త్వరలో ఇండియా అంతటా వీటి నెట్వర్క్ విస్తరించేందుకు చురుగ్గా దూసుకు వస్తుంది ఈ తైవాన్ కంపెనీ.