హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 51 మంది మృతి చెందారు, కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు మూసుకుపోయాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, సిమ్లాలోని ఆలయ శిథిలాలలో భక్తులు సమాధి అయ్యారు.
రాష్ట్ర రాజధానిలో రెండు కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల నుండి పద్నాలుగు మృతదేహాలను వెలికితీశారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం శిధిలాల కింద ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు శ్రావణ మాస పూజల్లో ఈ మందిరం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇకపోతే, మండి జిల్లాలో వర్షాల కారణంగా 19 మంది మరణించారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి పిటిఐకి తెలిపారు.