IIIT Basar Selection List: బాసర ట్రిపుల్ ఐటీ సెలెక్షన్ లిస్ట్ విడుదల

 

IIIT Basar Selection List: బాసర ట్రిపుల్ ఐటీ సెలెక్షన్ లిస్ట్ విడుదల

తెలంగాణలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ (Basar)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి మొత్తం 1500 సీట్లకు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లను స్వీకరించగా, సుమారు 15 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టెన్త్ జీపీఏ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెంకటరమణ ప్రకటించారు. ప్రస్తుతం అలాట్ చేసిన 1,404 మందిలో 976 మంది అమ్మాయిలు, 428 మంది అబ్బాయిలు ఉన్నారు.

బుధవారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ ఫేజ్ షార్ట్ లిస్టును ఆర్జీయూకేటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వీసీ వెంకటరమణతో కలిసి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. 

ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 9, 10 తేదీల్లో పరిశీలించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

బాసర ట్రిపుల్‌ఐటీ ఎంపిక జాబితా లింక్‌ 

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు పొందినవారు ప్రతి ఏడాది రూ.30 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. ఇక ఎన్నారై విద్యార్థులు ఏటా రూ.3 లక్షలు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏటా రూ.1.36 లక్షల బోధన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గ్లోబల్‌ కోటాలో ఏటా రూ.1.36 లక్షలు చెల్లించి స్థానికులు ఎవరైనా సీటు పొందే వెసులుబాటు ఉంటుంది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Join WhatsApp Channel