కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగాయి. మొత్తం 44 ఐఏఎస్ ల పోస్టులను బదిలీ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను మరో పోస్టుకు బదిలీ చేసింది. ఇక ఆయన స్థానంలో అమ్రపాలిని హైదరబాద్ కమిషనర్ గా నియమించింది. ప్రస్తుతం ఆమె హెచ్ఎండీఏ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 44 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను ట్రాన్స్ కో సీఎండీగా నియమించింది. అలానే సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలానే పర్యాటక, క్రీడల డైరెక్టర్‌గా వాణిప్రసాద్, దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్ నియమించారు.
బదిలీ అయిన IASలు
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
విద్యుత్ శాఖ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్
రొనాల్డ్ రోస్కు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు
రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి
పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్
యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్
చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య
హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు
అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్
టీపీటీఆర్ఐ డీజీగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ముఖ్యకార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్
జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి
స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
రవాణాశాఖ కమిషనర్‌గా కే.ఇలంబరితి
జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్
హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
జలమండలి ఎండీగా కె.అశోక్‌రెడ్డి
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి
జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హెచ్‌కె. పాటిల్
జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ్ చౌహన్
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉపేందర్‌రెడ్డి
కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన
సెర్ప్ సీఈవోగా డీ.దివ్య
ప్రజావాణి నోడల్ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు
పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాశ్‌రెడ్డి
ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి
గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్
పురపాలక శాఖ డైరెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు
ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు
ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్ మిశ్రా
కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవి
గ్రామీణాభివృద్ధి సీఈవోగా కే.నిఖిల
ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్ బాషా
ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు
ప్రొటోకాల్ డైరెక్టర్‌గా ఎస్.వెంకట్రావు
వ్యవసాయ, సహకార సంయుక్త కార్యదర్శిగా జి.ఉదయ్‌కుమార్
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గోపికి అదనపు బాధ్యతలు
ఫిషరీస్ డైరెక్టర్‌గా ప్రియాంక
టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి
రాష్ట్ర ఆర్థికసంఘం ఎండీగా కాత్యాయని దేవి
పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి
సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు
వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
భద్రాచలం ఐటీడీఏ పీవోగా రాహుల్
మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి
టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.