అందరూ ఎదురు చూసిన ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు నిన్న విడుదల చేశారు. పలు ప్రముఖుల గెలుపు ఓటములను నిన్న జరిగిన సమావేశంలో చెప్పారు. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గన్నవరంలో వంశీ గెలుస్తారని చెప్పిన ఆయన ఎందరో ఎదురు చూసిన కొడాలి నాని కోసం మాత్రం చెప్పలేదు.
ఈరోజు ఓక టీవీ చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఏంకర్ అడిగగింది. దీనికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఆయన.
గుడివాడలో కొడాలి నాని తీవ్ర పోటీ ఎదుర్కొన్నారని అక్కడ పరిస్థితి టీడీపీకే అనుకూలంగా ఉంది అని మస్తాన్ అన్నారు.
రూరల్ ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగానూ, పట్టణ ప్రాంతాల్లో కూటమికి అనుకూలంగానూ ఓటు పడినట్లు ఆయన చెప్పారు.