Pune Minor Accident Case: ఇద్దరిని చంపిన మైనర్ కు గంటల్లోనే బెయిల్ ఇవ్వడం పై ఆందోళనలు

Pune Minor Accident Case: ఇద్దరిని చంపిన మైనర్ కు గంటల్లోనే బెయిల్ ఇవ్వడం పై ఆందోళనలు

మద్యం సేవించి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన మైనర్ బాలుడికి అక్కడి కోర్టు కేవలం 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇది ప్రమాదం కాదు అని “హత్య” అని బాధిత కుటుంబంతో పాటూ పూణే లోని సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. 

రెండు రోజుల క్రితం పదవతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ధనిక కుటుంబానికి చెందిన మైనర్లు బారులో పార్టీ చేసుకున్నారు. తప్ప తాగిన తర్వాత ఖరీదైన కారులో వేగంగా డ్రైవ్ చేసిన బాలుడు 24 ఏళ్ల అనీష్ అవధియా, అశ్విని కోష్ట అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనగా వారు అక్కడికక్కడే మరణించారు.

మైనర్లను, వాహనం నడిపిన బాలుడి తండ్రిని, బార్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరు పరచగా మైనర్ బాలుడికి చిన్ని శిక్షతో బెయిల్ మంజూరు చేసింది. “రోడ్డు ప్రమాదాలు- నివారణ” అనే విషయంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. 

దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 

షాకింగ్  – బార్ లో  90 నిమిషాల్లో 48 వేల రూపాయలు 

ఈ ఘటనలో మరో తాజా వార్త .. మైనర్ బాలురు పార్టీ చేసుకున్న బార్ లో వాళ్ళు గంటన్నర వ్యవధిలో ఆక్షరాలా 48000 రూపాయలను ఖర్చు చేసినట్లు పూణే పోలీస్ కమీషనర్ అమితేశ్ కుమార్ చెప్పారు.


Can you imagine?
somebody’s life is bigger than with a punishment of writing an essay.

As per @abpmajhatv news victims father Vishal Agrawal is absconding. Various police teams have been dispatched to search for him.#Justice #VedantAgarwal #Punepic.twitter.com/07T5helziL

— Sagar Lohatkar (@sagarlohatkar) May 20, 2024

Cameron Herrin (18) of USA🇺🇲 was sentenced to 24 years of imprisonment for killing a mother & her baby by overspeeding a Ford Mustang.

Vedant Agrawal (17) of India🇮🇳 He killed Two 24-Year-old engineers with his overspeed Porsche, but he is free within 15 hours.#Porsche #Pune pic.twitter.com/l8Rkqjr634

— Sumit (@SumitHansd) May 22, 2024

वेदांत अगरवालची Alcohol test निगेटिव्ह आल्याचे समोर आले आहे. परंतु या व्हीडीओ मध्ये तो मित्रांसोबत पार्टी करताना स्पष्ट दिसत आहे. मग वेदांत चा खोटा रिपोर्ट देण्यात आला का? खोटे रिपोर्ट देणार्यांविरुद्ध कारवाई होणार का?@AjitPawarSpeaks @suniltingre @Dev_Fadnavis @DGPMaharashtra pic.twitter.com/gRQdFhzXct

— Archana More-Patil (@Archana_Scoope) May 20, 2024

Join WhatsApp Channel