Theaters Bundh: తెలంగాణలో మూతపడనున్న 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు

Theaters Bundh: తెలంగాణలో మూతపడనున్న 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు

శుక్రవారం నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మినహా మిగతా చోట్ల సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసి వేస్తున్నట్తు ఎగ్జిబిటర్ కౌన్సిల్
ప్రకటించింది. కొత్త సినిమాలు లేక ధియేటర్లు నడపడం చాలా కష్టంగా ఉందని
ధియేటర్ల యజమానులు తెలిపారు. మే 17 నుంచి రాష్ట్రంలోని ద్వితియ శ్రేణి
నగరాల్లో దాదాపు 800 వరకు సింగిల్ స్క్రీన్ ధియేటర్లు బంద్ అవుతాయని చెప్పారు.  దాదాపు 10 రోజులు పాటు ధియేటర్లను బంద్ చేయనున్నట్టు తెలిపారు

నిర్వహణ భారం ఎక్కువ
కావడంతోనే సింగల్ స్క్రీన్ ధియేటర్లను బంద్ చేయాలని ఆలోచిస్తున్నట్టు
తెలుస్తుంది.   ధియేటర్ అన్నాక.. ఒకసారి హాల్ మొత్తం నిండినా నిండకపోయినా.. ఒక్కోసారి ఒక్క టికెట్ తెగినా హాల్ మొత్తాన్ని నడపాల్సి
వస్తుంది.

ఈ క్రమంలోనే మెంటెన్స్  ఎక్కవ అవుతుండటం కరెంటు, గేట్ మ్యాన్ల జీతాలు
కూడా ఎల్లని ఎన్నో సందర్భాలు ఉన్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు.   ప్రతి
ఏడాది వేసవిలో చిన్నా,  పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయాని ఈ ఏడాది కూడా
విడుదల అవుతాయని అనుకున్న క్రమంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

మరోవైపు ఏపీలో 12‌ వందల సింగిల్ స్ర్కీన్ ధియేటర్లు  ఉన్నాయి. మరి అక్కడ
మూసేస్తారా లేదా అనేది ఎగ్జిబిటర్లు చర్చించనున్నట్టు తెలుస్తుంది.  

 

Join WhatsApp Channel