కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు.. ఆ స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతి. అయితే తిరుపతి తర్వాత స్వామివారు స్వయంభూ గా వెలసిన క్షేత్రం ‘వాడపల్లి’.
ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి లో ఎర్ర చందన కొయ్యలో వెలసిన ‘స్వయంభూ’ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ‘కళ్యాణ వేంకటేశ్వరుడు’ అని కూడా పిలుస్తారు.
శ్రీ మచ్ఛన్ధన విగ్రహ విభవజుషాం పాపౌఘవిధ్వంసకం
ధృత్వాయం భువివేంఞ్యటేశ్వర విభుర్నౌకాపురే భాసురః
సర్వద్రోహకరాంస్తమౌ గుణ మయాంచ్ఛక్రాయుధే నాచిరా
ద్ధుశ్రీకాన్విష భూరుహేణ సదృశాన్ధూరీ కరోతి స్వయమ్
పెద్ద తిరుపతి, ద్వారకాతిరుమల తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలు మరో తిరుపతిగా భావించుకొని శ్రీ వేంకటేశ్వరుని సేవించుకునే క్షేత్రం వాడపల్లి గోదావరి నదీ పాయ అయిన గౌతమీ తీరంలో కొలువున్న ఈ స్వామిని దేవర్షి నారదుడే ప్రతిష్ఠింపచేశాడంటారు. పురాతన చరిత్రగల ఆలయాలలో ఇది ఒకటి.
రాజమండ్రి సమీపంలో అఖండ గోదావరి రెండుపాయలుగా విడిపోతుంది. ఆ రెండు పాయలూ 100 కి..మీ.. దూరం ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ రెండు పాయలలో ఒకటి గౌతమి, రెండవది వశిష్ఠ. ఈ రెండింటి మధ్య నున్నదే కోనసీమ. కొబ్బరితొటలతో, పంటకాలువలతో కళకళ్ళాడుతూ కనిపించే కోనసీమ పేరు వింటేనే మండువేసవిలో సైతం మనసు చల్లబడుతుంది.
రాజమండ్రికి 30కి..మీ దూరంలొ, రావులపాలెం కు 8 కి..మీ.. దూరంలొ, తూర్పుగోదావరిజిల్లా, ఆత్రేయపురం మండలంలో వున్న వాడపల్లి నేటికి ఆధునిక నాగరికత ఆనవాళ్ళు అంతగా కనిపించని, ఒకనాటి గ్రామసీమలను తలపునకు తెచ్చేగ్రామం. ఈ గ్రామంలో విశలమైన ఆవరణ కలిగి చుట్టూ ప్రాకారాలతో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రముఖంగా కనిపిస్తుంది. వాడపల్లి గ్రామాలు ఒకటికి మించి ఉన్నాయి కనుక యాత్రికులు ఇక్కడకు రావాలనుకుని మరో వాడపల్లికి వెళుతుంటారని , ఆ ప్రమాదాన్ని నివరించడనికే దీనిని చినవాడపల్లిగా లేదా లొల్ల వాడపల్లిగా పేర్కొంటూ ఉంటారు
ప్రతి రోజు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. శనివారం నాడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదవ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం అందుకే ప్రతి స్థిరవారం ( శనివారం ) ఈ ఆలయానికి సుమారు 50 వేల కు పైనే భక్తులు విచ్చేస్తారు. ఎంతటి కష్టాలు అయిన సరే స్వామి వారిని 7 స్థిరవారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని బలమైన నమ్మకం. ఆరోజున 108 లేదా 7 ప్రదక్షిణాలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
Vadapalli Temple History స్థల పురాణం
వాడపల్లి గ్రామాన్ని పూర్వం ” నౌకాపురి ” అని పిలిచేవారు. నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తలలో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు.
మరొక కథ ప్రకారం, కలియుగంలో దాదాపు కొన్నివందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టెలో పెట్టి ఆగోదావరిలో నిమజ్జనం చేశారట. దాదాపు 1300 కిలోమీటర్లు నీటిలో కొట్టుకుని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి స్వామి చెప్పారట. దీంతో మేలతాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్లినప్పటికీ తొలిరోజు స్వామివారి విగ్రహం దొరకలేదని రెండవరోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ స్వామివారికి పూజల ప్రారంభించారట.
కాలక్రమేనా ఆలయ పూజలు అర్చకులకు భారంగా ఉండటం వలన స్వయంగా స్వామి వారు పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు గారికి కలలో కనిపించి దైవ సమాన పూజలతో నువ్వు పునితుడవు అయితే వైకుంఠమునకు చేరువుతావు అని చెప్పగా ఆయన స్వామి వారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లి కి చేరి స్వామి వారి నిత్య నైవేద్య పూజల నిమిత్తం 1759 వ సంవత్సరంలో రాజు గారు వారి ఆస్తి 270 ఎకరాలు స్వామి వారికి సమర్పించారు.
ఈ క్షేత్రం మూల విరాట్ రాతితో చేసినది కాదు చెక్కతో చేసినది. ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు.
వాడపల్లి దేవస్థానానికి రవాణా సదుపాయం కలదు. రాజమహేంద్రవరం నుండి, రావులపాలెం నుండి బస్సు సదుపాయం కలదు. కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెం నుండి 11 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 25 కిమీ దూరంలో కలదు. రైలు ద్వారా వచ్చే భక్తులు ముందుగా రాజమండ్రి చేరుకుని రైల్వే స్టేషన్ బయటకు రాగానే వివిధ బస్సులు, ఆటోలు వాడపల్లికి అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా రాజమండ్రి చేరుకుని అక్కడి నుండి వాడపల్లి వెళ్ళవచ్చు. ఇరువైపులా గోదావరి పాయల వెంబడి సాగే వాడపల్లి ప్రయాణం కూడా మనోహరమే!
స్వామి వారి వార్షిక బ్రహ్మొత్సవాలు ఆశ్విజ మాసంలో ‘ 5 ‘ రోజులు వైభవముగా జరుగును
ప్రతి సంవత్సరం స్వామి వారి తీర్థం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్-ఏప్రిల్ నెలల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. స్వామి వారి వార్షిక బ్రహ్మొత్సవాలు ఆశ్విజ మాసంలో జరుగును ‘ 5 ‘ రోజులు వైభవముగా జరుగును
7 Week Vratam: ఏడు శనివారముల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం
స్వయంభు క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని వరుసగా 7 శనివారములు దర్శించినచో భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును. ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామివారికి విన్నవించుకొని 7 సార్ల్లు ప్రదక్షణను చేసి స్వామి వారిని దర్శించుకోవలెను. స్త్రీల విషయంలొ ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగాచేసినచో 7 శనివారముల ఫలితము కలుగును. 7 శనివారములు దర్శనాలు పుర్తి అయిన పిదప స్వామి వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం , పప్పులు , నూనెలు ఏదైన గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచలు, లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించుకొనవచ్చును.
శనివారం అంటే శ్రీనివాసునకు ఎందుకిష్టం ?
1 | శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచిన రోజు | శనివారం |
2 | ఓంకారం ప్రభవించినరోజు | శనివారం |
3 | శ్రీస్వామి వారు శ్రీనివాసుని అవతరంలో ఉద్భవించినరోజు | శనివారం |
4 | సకల జనులకు శనిపీడలు తొలగించెరొజు | శనివారం |
5 | శ్రీ మహలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రొజు | శనివారం |
6 | శ్రీనివాసుని భక్తి శ్రద్థలతో ఎవరైతే పూజిస్తారో వారిజోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు | శనివారం |
7 | పద్మావతి శ్రీనివసుల కళ్యాణం జరిగిన రోజు | శనివారం |
8 | శ్రీ వారిని సకల ఆభరణాలతో అలంకరించేరోజు | శనివారం |
9 | స్వామి వారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించినరోజు | శనివారం |
Vadapalli Temple Timings: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వేళలు
ఆలయం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుండి ఒంటిగంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉండును. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం మాత్రం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచబడును. అలాగే వివిధ పండుగలు, పర్వదినాలలో వేళల సమయంలో మార్పులు ఉండవచ్చు.
శనివారం నాడు మాత్రమే తెల్లవారుజామున 3.15 నుండి 4 గంటల వరకు జరిగే సుప్రభాత సేవకు భక్తులు విశేషంగా దర్శించుకొంటారు.
రోజు | ఉదయం సమయం | సాయంత్ర సమయం |
ఆదివారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
సోమవారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
మంగళవారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
బుధవారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
గురువారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
శుక్రవారం | 6 : 00 AM – 1:00 PM | 4:00 PM – 8:00 PM |
శనివారం | 4 : 00 AM – 2:00 PM | 4:00 PM – 9:00 PM |
Vadapalli Temple Tickets దర్శనం టికెట్లు
దర్శనం టికెట్లు వివిధ కౌంటర్లలో ఆలయం వద్ద లభిస్తాయి. ఉచిత దర్శనం సదుపాయం కలదు. రూ. 10, 25, 50 టికెట్ల దర్శనం కలదు. వివిధ సేవలు టికెట్ల ధరలు క్రింద ఇవ్వబడ్డాయి
సేవలు | టికెట్టు ధర (Rs) |
గోత్రనామం | 5 |
కేశఖండన | 5 |
అష్టోత్తరం | 20 |
సహస్రనామం | 30 |
వాహన పూజ: 4 చక్రాలు | 50 |
వాహన పూజ: ద్వి చక్రాలు | 20 |
కళ్యాణం | 350 |
తులాభారం | 50 |
స్పెషల్ దర్శనం | 10 |
విశిష్ట దర్శనం | 25 |
గోదా దేవి కల్యాణం | 501 |
Vadapalli Venkateswara Swamy Temple: వాడపల్లి ఆలయంలో జరుగు ఇతర పూజలు
సుప్రభాత సేవ (శనివారం మాత్రమే) : తెల్లవారుజామున 3.15 నుండి 4 గంటల వరకు
బాల భోగం : ఉదయం 05:30 నుండి 6 గంటల వరకు
ప్రత్యేక్ష అష్టోత్తర పూజ (శనివారం మినహా) : ఉదయం 08:30 నుండి 9.30 వరకు ( టికెట్ రూ.150/-)
ప్రత్యేక్ష కళ్యాణం (శనివారం మినహా): ఉదయం 10 నుండి 11.55 వరకు ( టికెట్ రూ.750/-)