అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా! జగన్ కు బోండా ఉమా సవాల్

అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా! జగన్ కు బోండా ఉమా సవాల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి చేశాననడం సిగ్గు చేటు అని, దీనిపై దమ్ముంటే చర్చకు రావాలి అని ఆయన డిమాండ్ చేశారు. మద్య నిషేదం తెస్తానని మద్యంపై విపరీతంగా ఆదాయం పెంచుకుని అదే డబ్బులను పథకాల పేరుతో పంచుతున్నారని, కరెంట్ చార్జీలను పెంచి, కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని నోదా ఉమా విమర్శించారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుని పట్టుకుని చెప్పుకోడానికి ఏం చేశావు అని అనడం హాస్యాస్పదం అని అన్నారాయన. చంద్రబాబు అంటే అభివృద్ది అని , జగన్ అంటే విధ్వంసం అని అన్నారు. మీ చరిత్రే అవినీతి మరకలతో ఉంది అని తీవ్రంగా విమర్శించారు.

Join WhatsApp Channel