ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రానుందా …

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రానుందా ...

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోబోతోందా… అవుననే అంటున్నారు విశ్లేషకులు. 

లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికలకు అధికారం చేపట్టే దిశగా పావులు కదప నుంది. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంత్సాహం వచ్చింది. ప్రస్తుతం ఏర్పడ్డ సంకీర్ణ ఎన్డీయే సర్కార్ అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగడం కూడా కష్టమనే అభిప్రాయం ఇండియా కూటమి నేతల్లో ఉంది. 
ఎన్డీయేలో ఉన్న ముఖ్య నాయకులు ఒకప్పుడు కూటమి నేతలతో కూడా సత్సంబంధాలు కలిగిన వారే.  ఒక వేళ వారు ప్లేట్ ఫిరాయిస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. 
ఈలోపు తమ బలాన్ని మరింత పెంచుకుని కూటమిలో అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతోంది .. గుజరాత్, మద్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణా , కర్ణాటకల్లో కాంగ్రెస్ మరింత మంచి ఫలితాలు సాధించ వలసింది అని ఆ పార్టీ అధిష్టానం భావించింది. తెలంగాణలో ఇలా ఫలితాలు రావడానికి కేసీయార్-బిజెపి కుమ్మక్కు అయ్యారు అనే అభిప్రాయం రాష్ట్ర నేత నుంచి వెళ్ళింది. 
కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టి .. అక్కడ పార్టీని బలోపేతం చేసే చర్యలతో పాటూ ఆంధ్రప్రదెశ్ లో ఫలితాలపై కూడా విశ్లేషణ మొదలు పెట్టింది. 
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్తుతం పతనావస్థలో ఉన్న నేపథ్యంలో వైఎస్ వారసురాలిగా షర్మిల ఈమేరకు ఓట్లు రాబట్టింది అని విశ్లేషిస్తున్నారు.
సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం  జగన్ మొండి వైఖరి ఆ పార్టీకి నష్టం కలిగించింది అనే అభిప్రాయంతో ఆ పార్టీ ఉంది. అయితే తిరిగి కాంగ్రెస్ ఓట్లను రాబట్టేందుకు ఎలా పావులు కదపాలి అని విశ్లేషణ చేస్తోంది. వైసీపీ అసంతృప్తి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం.. మైనారిటీల్లో సానుకూలత కలిగించడం.. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను చేయడం లాంటి చర్యల ద్వారా వైసీపీ స్థానాన్ని ఆక్రమించే ఆలోచన కొందరి నాయకుల నుంచి వచ్చింది. 
చూడాలి రాబోయే కాలంలో ఏపీలో ఎలా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయో?!!

1 thought on “ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రానుందా …”

  1. కేవలం ఊహాగానాలు విశ్లేషణలు అనిపించుకోవు. 240సీట్లతో ఒకపార్టీ సంకీర్ణప్రభుత్వం ఏర్పరిస్తే అది తుమ్మితే ఊడే ముక్కు అని కాంగ్రెసు భావిస్తే తాను కేవలం 99 సీట్లతోనే స్థిరప్రభుత్వాన్ని ఏర్పరచగలను అని నమ్మటాన్ని పిచ్చితనం అని కాక ఏమనాలి?

    240సీట్లతో ఉన్నపార్టీకి ప్రజాభిమానం లేదనీ తమకు కేవలం 99 సీట్లతోనే అఖండమైన ప్రజాభిమానం ఉందనీ అనుకోవటాన్ని పిచ్చితనం అని కాక ఏమనాలి?

    కాంగ్రెసుకు ఆంధ్రాలో వచ్చిన ఓట్లశాతం మూడులోపే ఐనప్పుడు అది త్వరలో అధికారానికి బాటలు వేస్తుంది అని విశ్లేషణలు చేయటాన్ని కూడా పిచ్చితనం అని కాక ఏమనాలి?

    పగటికలలు మాని కాంగ్రెసువారు వాస్తవప్రపంచంలోనికి రావాలి.

Comments are closed.

Join WhatsApp Channel