ఐటి శాఖ నోటీసుల ప్రభావం: 60 స్థానాల్లో పోటీకి బాబుపై ఒత్తిడి?

  • బాబుపై ఒత్తిడి పెంచుతున్న బిజెపి
  • 70 లోపు స్థానాల్లో పోటీ చేయించి మిగతా స్థానాల్లో బిజెపి, జనసేనకు కేటాయించేలా ఒత్తిడి.
  • వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో టిడిపికి కేటాయించే ఎత్తుగడ

ఐటి శాఖ నోటీసుల ప్రభావం: 60 స్థానాల్లో పోటీకి బాబుపై ఒత్తిడి?

 

త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలలో టిడిపిని సగంలోపు స్థానాల్లో పోటీ చేయించే ఎత్తుగడ బిజెపి అధినాయకత్వం వేస్తుందా? చంద్రబాబుకి ముఖ్యమంత్రి యోగం ఇక లేనట్లేనా? టిడిపి పిల్ల పార్టీగా మారనుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇటీవల కేంద్ర ఐటిశాఖ చంద్రబాబుకి జారీ చేసిన నోటీసుల నుంచి బయట పడడం చాలా కష్టం అని తెలుసుకున్న చంద్రబాబు ఆ నోటీసులకి సమాధానం ఇవ్వకుండా సాంకేతిక కారణాలను చూపడానికి ప్రయత్నంచారు. వాటిని ఐటి అభికారులు తప్పుపట్టి మరో సారి నోటీసులు జారీ చేసారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్తితి ముందు వెనకా నుయ్యే అన్నట్లుంది.

తన సన్నిహితులతో, తన కోటరీ అధికారులు, నాయకులు ఇలా ఎంతమందితో ప్రయత్నాలు చేస్తున్నా అస్సలు బిజెపి అధినాయకత్వం పట్టించుకోవడం లేదు.

ఐటిసాఖ చేసిన ఆరోపణల్లో నిజం ఉన్నా, వాటికి సమాధానం ఇవ్వకపోయినా బాబుకి శిక్ష పడడం ఖాయం. అందుకే పొత్తులకి అంగీకారం తెలిపారు. ఇటీవలే “తాము బిజెపితో పొత్తుకి సిద్దం’ అని చెప్పారు అంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడే బిజెపి అధినాయకత్వం కీలకంగా ముందు అడుగులు వేస్తున్నది. బిజెపి- జనసేన కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో పోటీచేసి అధికారంలోకి రావడమో లేక ప్రధాన ప్రతిపక్షంగా నిలవదమో చేసి టిడిపి పార్టీని తుడిచి పెట్టె దిశగా పావులు కడుపు తున్నది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందరేశ్వరి నియామాకం వెనక కూడా వ్యూహం ఉంది అనేది వారి వాదన. టిడిపి అధికారం లోకి రాదు అని అని తెలిస్తే జగన్ కు బడ్డ శత్రువులు అయిన తెలుగుదేశంకు చెందిన కమ్మ వోట్ బ్యాంకు బిజెపికి మారడం ఖాయం అని బిజెపి వ్యూహం అని టిడిపిని సపోర్ట్ చేసే ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది.

ముందు ముందు ఈ ఎత్తుగడలు మరింత వేగం పుంజుకోవడం ఖాయం. మరి పవన్ వ్యూహం ఇలా ఉందొ భవిష్యత్ లో తెలుస్తుంది.

Join WhatsApp Channel