ఇటీవల యాత్రలు చేస్తున్న లోకేష్ , పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లో నేతలతోపాటూ ఆ అధినేతలూ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నాయి. ఈ ముగ్గురు నాయకులూ వారి అనుచరులూ తమ తమ ప్రసంగాలలో తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము అనేది ఎక్కడా చెప్పడం లేదు .
వారి ప్రసంగాలలో కేవలం సియం జగన్ ను, వైసీపీ నేతలను, పోలీసులను వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. జగన్ ను జైలుకి పంపుతాను అని ఒక నేత అంటే , వంశీ, నానీ లను చంపుతాము అని ఒకరూ, కట్ డ్రాయర్ తో నడిపిస్తాం అని ఒకరూ ఇలా అంటున్నారు. చంద్రబాబు అయితే ఇక చెప్పనక్కర లేదు… ఆగం ని వాడూ వీడూ అంటూ మేము అభికారం లోకి వస్తే మీ అంటూ చూస్తాం అని తిట్ల దండకం అందుకుంటూ ఉన్నారు .
సామాన్య ప్రజలు వీరి మాటలను చూసి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆనాడు జగన్ నంద్యాలలో జగన్ చంద్ర బాబుని బంగాళా ఖాతంలో పడెయ్యాలి అంటేనే ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. తాము చేసేది ఏంటో చెప్పకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ గతి ప్రతిపక్షాలకు పట్టడం ఖాయం అంటున్నారు.