ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.. గతానికి భిన్నంగా ఎన్నికలకు ముందు ఎన్నో సర్వే సంస్థలు తమ తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఏ ఒక్క సర్వేతోనూ ప్రజలకు స్పష్టత రాకపోగా మరింత గందరగోళం కలిగింది. కొన్ని సర్వేలు జగన్ భారీ మెజార్టీతో మరోసారి గెలుస్తాడు అని చెప్పగా.. మరి కొన్ని కూటమి దెబ్బకు వైసీపీ కకావికలం అవుతుంది అని చెప్పాయి. రెండు వైపులా ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారం కూడా ప్రజల మదిలో అనేక ఆశలు, భయాలు నెలకొల్పింది.
మొత్తానికి భారీ ఓటింగ్ శాతంతో పోలింగ్ ముగిసింది. నిజానికి పోలింగ్ తర్వాత ప్రజల మనసులో ఏముంది అనే విషయంలో కాస్త స్పష్టత వస్తుంది. కాస్తో కూస్తో ఎవరు అధికారంలోకి వస్తున్నారో తెలుస్తుంది. గతంలో కూడా ఇదే జరిగింది. అయితే ఎన్నికల ముందు ఉన్న కన్ఫ్యూజన్ ఎన్నికలు ఐపోయాక మరింత పెరిగింది.
పెరిగిన ఓటింగ్ శాతం ఏం చెప్తోంది?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ
లేని విధంగా రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర
ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుత లోక్ సభ
ఎన్నికల్లో దేశంలో ఇప్పటి వరకూ నాలుగు దశ పోలింగ్ జరగ్గా.. ఇప్పటి వరకూ
నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెరగడం తమకు
కలిసి వస్తుందంటే.. తమకు కలిసొస్తుందని వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు
చెబుతున్నారు.
అయితే గత గణాంకాలు చూస్తే, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 77.96 శాతం పోలింగ్
నమోదైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019
ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.68
శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనగా.. ప్రతిపక్ష
వైఎస్సార్సీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది.
తీసుకుంటే.. 1999 ఎన్నికల్లో 69.15 శాతం పోలింగ్ నమోదు కాగా.. టీడీపీ
అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే అంతకు ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో
70.02 శాతం పోలింగ్ రికార్డయ్యింది. 1994 కంటే 1999లో పోలింగ్ శాతం
కొద్దిగా తగ్గగా.. టీడీపీ అధికారాన్ని నిలుపుకొంది. 2004లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగి 69.96 శాతంగా
నమోదైంది. ఈసారి అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ఓడిపోయి.. కాంగ్రెస్
అధికారంలోకి రాగా.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2009లో 72.7 శాతం
పోలింగ్ నమోదైంది. రెండున్నర శాతానికిపైగా పోలింగ్ పెరిగిన ఈ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ రెండోసారి సీఎం అయ్యారు. అయితే 2009లో
ప్రజారాజ్యం కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగింది. 2014 ఎన్నికల్లో పోలింగ్ 78 శాతం నమోదైంది. అయితే ఉమ్మడి ఏపీలో అవి చివరి
ఎన్నికలు కావడంతోపాటు.. పోటీలో ఉన్న రెండు పార్టీలు కూడా అప్పుడు అధికారంలో
లేవు. కొత్త రాష్ట్రం కావడంతో ఓటర్లు అనుభవం ఉన్న నేత వైపు మొగ్గు చూపారు.
విశ్లేషకులు ఏం చెపుతున్నారు?
పోలింగ్ శాతం పెరిగినప్పటికీ వైఎస్ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు
జగన్ తిరిగి అధికారంలోకి వస్తారు అని కొందరు,