BJP: సోము వీర్రాజుని తొలగించి బిజెపి తప్పు చేసిందా? టిడిపి-జనసేన పొత్తు తర్వాత మారిన సమీకరణాలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది. 

BJP: సోము వీర్రాజుని తొలగించి బిజెపి తప్పు చేసిందా? టిడిపి-జనసేన పొత్తు తర్వాత మారిన సమీకరణాలు

 

అయితే కుల సమీకరణాలు ప్రభావం చూపే ఎపి రాజకీయాలు ఈ పొత్తుతో ఎలా మారతాయో అని విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్న కులాల్లో రాజకీయ ఉత్తేజం కలిగిన కులాలు మూడు. అవి రెడ్డి, కమ్మ, కాపు. వైసిపికి రెడ్లు అండగా ఉంటారు అని చెప్పనక్కరలేదు. అలాగే కమ్మలు తెలుగుదేశానికి అండదండలు అందిస్తారు. కాపుల విషయానికి వస్తే కాంగ్రెస్ పతనం తర్వాత వారికి కొద్దికాలం క్రితం వరకు సరైన రాజేకీయ అండ లేదు అని భావించారు. ప్రజారాజ్యం వారు పెట్టుకున్న ఆసలను వమ్ము చేసినా చిరంజీవి తమ్ముడు పవన్ జనసేన స్థాపించిన తర్వాత ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

నిజానికి కాపులకు కమ్మవారిక్ ఉన్న వైరం మారూలుది కాదు. రంగా హత్య తర్వాత కాపులు పూర్తిగా తెలుగుదేశం పై కోపం పెంచుకున్నారు. ఒకరితో ఒకరికి ఉప్పు నిప్పుగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు జనసేన అధినేత టిడిపి పొత్తు ఉంటుంది అని చెప్పడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. కానీ, పవన్ ఆలోచన వేరు. చాలా కాలం క్రితం జరిగిన రంగా హత్యను ఇప్పటి తరం మర్చిపోయింది అని ఆయన భావిస్తున్నారు. తన వెనక ఉండే యువకులలో కమ్మవారిపై కోపం లేదు అని ఆయన భావిస్తున్నారు. మారుతున్న ఈ కాలంలో కూడా ఇంకా కమ్మవారిపై కోపం కాపులకు ఉంది అని ఆయన అనుకోవడం లేదు. అందుకే ధైర్యం చేసి పొత్తుకి జండా ఊపారు.

అయితే విశ్లేషకుల అభిప్రాయం వేరే విధంగా ఉంది. టిడిపి-జనసేన పొత్తుతో కాపులు ఆగ్రహంగా ఉన్నారు అని వారు భావిస్తున్నారు. కాపు నాయకులు పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆ కులం యువత ధైర్యం చేసి పవన్ కి సపోర్ట్ చెయ్యరని వారు అంటున్నారు.

ఇటీవలే బిజెపి అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుని తప్పించి చంద్రబాబు వదిన అయిన దగ్గుపాటి పురంధరేశ్వరిని నియమించింది. సోము కాపు సామాజికవర్గం కాగా పురంధరేశ్వరి కమ్మ సామాజిక వర్గం. వీర్రాజు పదవిలో ఉంది ఉంటె పవన్ పొత్తుతో డోలమాయ స్థితిలో ఉన్న కాపు సామాజిక వర్గం బిజెపి వైపు చూసేది. ప్రస్తుతం ఆ అవకాశాన్ని బిజెపి చేతులారా పోగొట్టుకుంది అని విశ్లేషకుల అభిప్రాయం.

కాంగ్రెస్ ను తమదిగా భావించిన కాపులు వైసిపిని .నమ్మాలి అంటే ఆ పార్టీ చాలా ప్రయత్నాలు చెయ్యాల్సి ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు. కాపు నాయకులను తమ పార్టీలోకి రప్పించడంతో పాటూ ఆ సామాజిక వర్గానికి అనేక తాయిలాలు అందిచాల్సి ఉంటుంది. రెడ్లను కాదు అని కాపులకు కూడా తమ పార్టీలో అంతటి సముచిత స్థానం కల్పిస్తే ఇప్పటికైనా వైసిపి కాపు ఓట్లను పొంద గలుగుతుంది.

అయితే ఈ విషయంలో బిజెపి వెనక పడడానికి కారణం సోము వీర్రాజుని తొలగించడమే .

Join WhatsApp Channel