Flood Expanses: రూ.23 కోట్లు కాదు 23 లక్షలే.. ప్రభుత్వ ప్రకటన

వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెల‌కు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చుపెట్టారు అనేది అస‌త్య ప్ర‌చారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ రెవెన్యూ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ.23 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని సామాజిక మాధ్యమాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ప్ర‌భుత్వ రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా ఒక ప్ర‌క‌ట‌న‌లో ఈ ప్ర‌చారాల‌ను ఖండించారు.

అవ‌న్నీ ఫేక్ ప్ర‌చారాల‌ని కొంత‌మంది ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డం కోసం, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడం కోసం ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. వ‌ర‌ద‌ల కార‌ణంలో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక రాత్రిళ్లు ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డార‌ని, వారికి రాత్రిళ్లు ఇబ్బందులు త‌లెత్త‌కుండా మొబైల్ జ‌న‌రేట‌ర్లు త‌ల‌రించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు చేస్తున్నట్లుగా కేవ‌లం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి రూ.23 కోట్లు వెచ్చించామ‌న‌డం పూర్తీగా నిరాధార‌మైంది, అస‌త్య ప్ర‌చార‌మ‌న్నారు. ఈ ఖ‌ర్చు ప్ర‌ధానంగా మొబైల్ జ‌న‌రేటర్ల కోసం వెచ్చించింద‌న్నారు.

దీంతో పాటు వ‌ర‌ద బాధితుల‌కు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అద‌నంగా అందించామ‌ని స్ప‌స్టం చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ఇలాంటి ప్ర‌చాల‌ను ప్ర‌జ‌లు ఏమాత్రం విశ్వ‌సించ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Flood Expanses: రూ.23 కోట్లు కాదు 23 లక్షలే.. ప్రభుత్వ ప్రకటన

Join WhatsApp Channel