Poonam Kaur Tweet: గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిలకు పూనమ్ కౌర్ సుధీర్ఘ లేఖ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన పై నటి పూనమ్ కౌర్ స్పందించారు.

‘ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా బాధిస్తున్నాయి. బయట ఎదుర్కొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ ఘటనలో విద్యార్ధులు అందరూ కలిసి ఒక శక్తిగా ఉండడం కంటే బాలమైనది ఇంకోటి లేదు. చట్టం బలహీనులపై బలంగా.. బలవంతులపై బలహీనంగా పని చేస్తుందని చాలామంది అంటూ ఉంటారు. మనదేశంలో జరుగుతున్న పరిస్తితులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నేరస్థులని రక్షించడం, బాధితులకు అన్యాయం జరగడం లాంటి చాలా అనుభవాలతో నేను అలసిపోయాను. తప్పు చేసిన విద్యార్ధుల సర్టిఫికెట్లు రద్దు చేసి బయటికి పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి.. కానే ఇక్కడ మాత్రం నిందితులపై చర్యలు ముందుకు కదలడం లేదు. తప్పు చేసిన వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వెనక్కి తగ్గవద్దు. వారి వివరాలన్నీ ధైర్యంగా బయటికి చెప్పండి.. న్యాయం కోసం మన రెజ్లర్లు చేసిన పోరాటమే మీకు స్పూర్తి’

‘ఓ అమ్మాయి తాను సేఫ్ గా ఉండడం కోసం చాలామంది అమ్మాయిలని ఇలా ప్రమాదంలో నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తోంది. నేరస్తులు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప‍్పండి. సలహాలు ఇవ్వడం సులభమే .. నాకు తెలుసు .. అయితే మీరు చేసే ఈ మాటపోరాటం ప్రక్క వాళ్ళలో కూడా ధైర్యాన్ని నింపాలి. మీరు చూడాలి అనుకుంటున్నా మార్పు మీతోనే మొదలవ్వాలి.. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రేమ, అభినందనలతో’ అని పూనమ్ కౌర్ నోట్ రిలీజ్ చేసింది.

అంతకు ముందు కూడా ఇదే ఘటనపై పూనమ్ ట్వీట్ చేసింది. దానిలో ఆమె “28 కెమెరాలు, 300 వీడియోలు.. ” అంటూ ఒక ఆడియోను రీట్వీట్ చేసింది.

Join WhatsApp Channel