Postal Jobs 2025: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసులో 21413 ఉద్యోగాలు, వివరాలివే …

0
3
postal-jobs-telugu
postal-jobs-telugu

Postal Dept GDS Jobs: భారత తపాలా వ్యవస్థ దేశవ్యాప్తంగా 21,413 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.వీటిల్లో ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. పదో తరగతి అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తి కలవారు 2025 ఫిబ్రవరి 10 నుంచి ఆన్ లైన్ వేదికగా 2025 మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 21,413

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు:

  1. ఆంధ్రప్రదేశ్- 1,215
  2. అస్సాం- 555
  3. బిహార్- 783
  4. ఛత్తీస్‌గఢ్- 638
  5. దిల్లీ – 30
  6. గుజరాత్- 1,203
  7. హరియాణా- 82
  8. హిమాచల్‌ప్రదేశ్- 331
  9. జమ్మూ అండ్‌ కశ్మీర్- 255
  10. జార్ఖండ్- 822
  11. కర్ణాటక- 1,135
  12. కేరళ- 1,385
  13. మధ్యప్రదేశ్- 1,314
  14. మహారాష్ట్ర- 1,498
  15. నార్త్ ఈస్ట్రన్‌- 1,260
  16. ఒడిశా- 1,101
  17. పంజాబ్- 400
  18. రాజస్థాన్- 2718
  19. తమిళనాడు- 2,292
  20. తెలంగాణ- 519
  21. ఉత్తర్‌ ప్రదేశ్- 3,004
  22. ఉత్తరాఖండ్- 568
  23. పశ్చిమ్‌ బెంగాల్- 923

అర్హత:

10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.

  • కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
  • సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.

వయసు:

  • కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

జీతం: 

  • బీపీఎం పోస్టులకు – రూ.12,000 నుండి రూ.29,380 వరకు
  • ఏబీపీఎం/డాక్ సేవక్ – రూ.10,000 నుంచి రూ.24,470 వరకు

ఎంపిక విధానం:   పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు : రూ. 100
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ – ఫీజు లేదు

దరఖాస్తు విధానం: https://indiapostgdsonline.cept.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక దరఖాస్తుకు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03-03-2025

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి