Prakasam Barriage in Danger: దేవునిపైనే భారం అంటున్న సుజనా..

ప్రకాశం బ్యారేజ్ కి పెనుముప్పు పొంచి ఉంది.. ఏ క్షణంలో ఏమవుతుందో అని అధికారులు భయపడుతున్నారు. ఇప్పటికే మూడు గేట్లు దెబ్బతిన్నాయి. వాటిని రిపేరు చేసే అవకాశం పూర్తిగా లేదు. ఇప్పటికే బ్యారేజి పునాది దెబ్బతిని ఉంటుందని ఇప్పుడు వరద ఉదృతి పైనుంచి తగ్గితే తప్ప బ్యారేజీని కాపాడలేము అంటున్న ఇంజినీర్లు..

వరదలో కొట్టుకు వచ్చిన నాలుగు బొట్లు బ్యారేజీ పిల్లర్లను ద్వంసం చేసినట్లు చెపుతున్నారు.

ఈ విషయంలో మాట్లాడిన స్థానిక ఎమ్మేల్యే సుజనా చౌదరి, ” కేవలం దేవుడు మాత్రమే ప్రకాశం బ్యారేజీని కాపాడాలి అని.. దేవునిపై భారం వేయడం ఉక్కటే మార్గం” అని అన్నారు.

మహోగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఉదృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది. బ్యారేజి వద్ద 11 లక్షల 40 వేల 776 క్యుసెక్కులకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా ఉంది.

Join WhatsApp Channel