2014 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు అనేక హామీలతో అభికారంలోకి వచ్చారు. రైతు ఋణ మాఫీ లాంటి హామీలతో పాటూ, నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అభివృద్ది పథంలో పెడతారని అనుభవజ్నుడైన చంద్రబాబుని ప్రజలు గెలిపించారు. అయితే ఆయన ఇచ్చిన పలు హామీలను గాలికి వదిలేసి.. కొన్నింటిని చివరి ఆరు నెలల్లో మమ అనిపించారు.
ఈ తప్పులను తర్వాతి 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ బాగా ఉపయోగించుకుంది. మాట ఇస్తే మడమ తిప్పను అంటూ జగన్ తన నవరత్నాలతో విజయభేరి మ్రోగించారు. చెప్పినట్లే దాదాపు అన్ని పధకాలనూ మొదటి రోజు నుంచే అమలుచేసుకుంటూ .. ఎన్ని కష్టాలు వచ్చినా ఆపకుండా కొనసాగించారు. ప్రజలు ఆయా పధకాలకు అలవాటు పడిపోయారు. 2024 ఎన్నికలవరకూ ఆయా హామీలు నెరవేర్చుకుంటూనే వచ్చారు.
అయితే 2024 ఎన్నికల్లో బాబు సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో ప్రకటించారు. వాటిలో చాలా వరకు గత ప్రభుత్వం అమలు చేస్తున్నావే అయితే వాటి నగదు పెంచడంతో ప్రజల్లో ఉన్న పధకాలను ఆపరు అని.. వాటికి అందించే నగదు పెరుగుతుంది అని నమ్మకం ఏర్పడింది.. వీటిల్లో అమ్మవొడిని 15000 కు పెంచడం, పింఛన్ 4000 కు పెంచడం , రైతుభరోసా 20000 కు పెంచడం లాంటివి ఉండడంతో.. ఆయా హామీలు తప్పకుండా అమలు అవుతాయి అని భావించారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇచ్చిన హామీల ప్రకారం పెంచడం మాట అటుంచి ఉన్న వాటిని కూడా కొనసాగించలేదు ప్రస్తుత ప్రభుత్వం.. దీనితో వోటమితో బాధలో ఉన్న వైసీపీ కార్యకర్తలు .. ప్రజల్లో వస్తున్న ప్రశ్నలకు తమ వంతు గళం కలిపారు.
అయితే కూటమికి ఉన్న మీడియా బాలమైనది కావడంతో ప్రజల గోడు బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఒకవైపు ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అవుతున్నా టిడిపి మీడియా మాత్రం రోజుకో అనవసర అంశాన్ని తీసుకు వస్తూ వైసీపీ కి వ్యతిరేకంగా బ్రేకింగులు .. డిబేట్ లు పెడుతూనే ఉంది.
అలాంటి పరిస్థితిలో అటు ప్రజలకైనా..ఇటు ప్రతిపక్షానికైనా మిగిలిన ఏకైక దారి .. సోషల్ మీడియా!
నిజానికి మిగతా పార్టీల సోషల్ మీడియా కంటే వైసీపీది చాలా బలమైనది.. లక్షలాది కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు.. ఇమేజ్ ల రూపంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం ప్రారంభించారు.. చాలా మంది ప్రజలు కూడా స్వచ్చందంగా తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే కూటమి ప్రభుత్వానికి తల నొప్పిగా మారింది.. ఇలా ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టే మార్గం ఎంచుకుంది… గతంలో కొందరు వైసీపీకి చెందినవారు టిడిపి నాయకులను వారి ఇంట్లోని మహిళలను బూతులతో దూషించారు.. వీటిని తిరగదోడిన కూటమి సర్కార్ వారి ద్వారా సోషల్ మీడియాను భయపెట్టే మార్గం ఎంచుకుంది.
అయితే, టిడిపి సానుభూతిపరులు కూడా వైసీపీ మహిళలను.. జగన్ భార్యను పిల్లలను కూడా వదిలి పెట్టకుండా బూతులు .. మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. వారిపై ఏమాత్రం చర్యలు లేకుండా కేవలం వైసీపీ సోషల్ మీడియా వారిపై కేసులు .. అరెస్టులు చేస్తూ తమ వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకునే మార్గంలో ఉంది ప్రస్తుత ప్రభుత్వం!
చూడాలి చంద్రబాబు సర్కార్ వ్యూహాలు ఏమేరకు ఫలించి సోషల్ మీడియాలో తమ వ్యతిరేక పోస్టులు రాకుండా ఉంటాయో!!!