Swiggy Boycott: చర్చలు సఫలం.. ఏపిలో స్వీగ్గీ బాయ్ కాట్ రద్దు.. హోటల్స్ నిర్ణయం

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని ఈ నెల 14 నుంచి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించిన హోటళ్ల అసోసియేషన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.

అంతకు ముందు, ఈ నెల 14 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణ చంద్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రారంభంలో స్విగ్గి హోటల్ వ్యాపారస్తులతో జీరో కమిషన్ అని ప్రారంభించి, ప్రస్తుతం 30శాతం కమిషన్ తీసుకుంటుందన్నారు. దీనికి తోడు అదనంగా జిఎస్టి వేసి వసూలు చేయటం, వ్యాపారస్తులకు సైతం తెలియకుండా ఆఫర్లు పెట్టడం, ప్రమోట్ చేస్తామని యాడ్స్ అడగటం లాంటి చర్యలతో హోటల్ వ్యాపారులు నష్టపోతున్నారని చెప్పారు. ఫలితంగా స్విగ్గిని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కావున హోటల్ వ్యాపారస్తులందరూ స్విగ్గిని ఆఫ్ చేసి, ప్రత్యామ్నాయంగా జొమోటోని వాడుకోవాలని సూచించారు.

స్వీగ్గీ దిగి వస్తుందా?

హోటళ్ల యాజమాన్యాలు స్విగ్గీకి ఇచ్చిన డెడ్ లైన్ అక్టోబర్ 14 తో ముగుస్తుంది. ఆ లోపు చర్చలు జరిపి దారికి వస్తే సరేసరి లేకుంటే స్విగ్గీని బహిష్కరించడం ఖాయమని హోటళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే స్విగ్గీ మాత్రం తమ షరతుల్ని సడలించేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో చర్చలు జరగబోతున్నాయి. అవి విఫలమైతే మాత్రం అక్టోబర్ 14 నుంచి స్విగ్గీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి.

Join WhatsApp Channel