Vijayawada Floods: విజయవాడ ముంపుకు కారణం…

శనివారం ఒక్కసారిగా వచ్చిన వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో అపార్ట్మెంట్ లను, ఇళ్లను పూర్తిగా ముంచేశాయి. దీనితో సర్వం కోల్పోయిన వాళ్ళు కట్టుబట్టలతో మిగిలారు.

బుడమేరు వాగుకి గండి పడడమే విజయవాడ నీట మునగడానికి ప్రధాన కారణం. సకాలంలో వాగు గేట్లు ఎత్తకపోవడం వల్ల వాగుకి గండి పడిందని విశ్లేషకులు అంటున్నారు.. అంతేకాదు దశాబ్దాలుగా ఆక్రమణదారులు బుడమేరు రెండువైపులా ఇళ్ళతో నింపేశారు. వరద నీరు ప్రవహించే అవకాశం లేక చుట్టుప్రక్కల ఇళ్లను ముంచెత్తింది.

అలాగే, బుడమేరు ఉధృతి పెరుగుతున్నా నగరంలో హెచ్చరికలు జారీ చేయకపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.ఇంకోవైపు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ప్రజలకు సకాలంలో హెచ్చరించి ఉండేవారు అని కొందరి అభిప్రాయం.

చూడాలి మరి.. అసలు ఏం జరిగినది అనేది ప్రభుత్వ విచారణలో తేలే అవకాశం ఉంది.

Join WhatsApp Channel