Pithapuram: టిడిపి నేత వర్మకు చెక్ .. జనసేనలోకి భారీగా చేరికలు

0
3
ycp-pendem-joined-janasena
ycp-pendem-joined-janasena

పవన్ కళ్యాణ్ స్వంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేన లోకి భారీగా చేరికలు సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆద్వర్యంలోనే జరగడం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశానికి, ఆ పార్టీ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు షాక్ అనే చెప్పాలి.

ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరగా ఆయనను పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆయనతో పాటు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తపలి పద్మ‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఇతర నాయకులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి చేరికతో పిఠాపురంలో జనసేన మరింత బలోపేతం కానుంది.

అయితే అక్కడ తమ ఉనికిని నిలబెట్టుకోవాలి అని శ్రమిస్తున్న వర్మకు ఆ పరిణామం మింగుడు పడదు అనే చెప్పాలి. ఇప్పటికే వివిధ కారణాలతో స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుకి వెళ్లలేక.. జనసేనలోకి పిరాయించిన ఆయా నాయకులను విమర్శించే అవకాశం లేక అయిమయంలో పడిందనే చెప్పాలి.. ఒకవైపు వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు పార్టీని వీడడంతో ఆ పార్టీకి కూడా తీరని నష్టమే.. దీనితో పవన్ కళ్యాణ్ చర్య ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వర్మకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న దొరబాబును జనసేనలోకి ఆహ్వానించడంపై వర్మ వర్గం తీవ్రంగా మధ్యన పడుతోంది. ఏ పదవి లేని తనకు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రాధాన్యం తగ్గిపోయిందని..టిడిపి కంచుకోటగా ఉండాల్సిన పిఠాపురం ఇప్పుడు శాశ్వతంగా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి పోయినట్లే అని ఆ వర్గం భావిస్తోంది..

చూడాలి మరి ఈ నియోజక వర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముందు ముందు ఏ పార్టీ ఉనికికి ప్రమాదమో!