YSR Congress: వైసీపీని ఖాళీ చేస్తున్న కూటమి పార్టీలు.. జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి?!

ఇటీవలి ఎన్నికల్లో ధారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మేయర్లు, ఎమ్మెల్సీలను తెలుగుదేశం లాగేసుకుంటుంటే.. అటు కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీలకు బిజెపి వల వేస్తోంది. జగన్ వైఖరి నచ్చక పార్టీ మారుతున్నాము అని స్టేట్మెంట్లు ఇచ్చినా .. వెళ్ళిన వాళ్ళు వారి అవసరాల కోసం, అధికారం కోసం వెళుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

జగన్ వీర విధేయుడైన మోపిదేవి వెంకటరమణ తన రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయన్నున్నారు. ఈ పరిణామం జగన్ క వ్యక్తిగతంగా పెద్ద దెబ్బే. మరోవైపు బీదా మస్తాన్‌రావు కూడా రేపు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో మరికొందరు రాజ్యసభ ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.

ఇక గతంలో టిడిపి నుంచి వైసీపీ లోకి వచ్చి ఎమ్మెల్సీ సీటు పొందిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రేవు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు. ఇప్పటికే ఏలూరు మేయర్ టిడిపిలో చర్యగా.. భారీ ఎత్తున కౌన్సిలర్లు కూడా వైసీపీ కి బై బై చెప్పబోతున్నారు.

రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకు పోబోతుందని టిడిపి నాయకుడొకరు చెప్పారు.. ఇదే నిజమైతే రాబోయే అయిదేళ్ళ పాటు జగన్ దాదాపు ఒంటరి పోరాటం చేయక తప్పదు.

జగన్ ముందున్న కర్తవ్యాలు ఏంటి

నిజానికి 40 శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉన్న జగన్ ఒంటరివాదు అని కూడా అనలేము. ఇంతకు ముందులా వివిధ పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా .. ఎప్పటి నుంచో పార్టీని .. జగన్ ను నమ్ముకున్న వీర విధేయులకు పెద్ద పీట వేయడం.. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం.. దురుసు వైఖరి వీడి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడం.. ఓటమికి కారణమైన వారంటూ అందరూ వేలెత్తి చూపుతున్నవారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం .. చేయాలి.

అంతేకాదు గత ఓటమికి తన వైఖరి కూడా కారణం అన్న విషయాన్ని గుర్తెరిగి.. తాను మారినట్లు నాయకులను నమ్మకం ఇవ్వడం ముఖ్యం.

Join WhatsApp Channel