పెట్రోల్, డీజిల్‌ రేట్లు భారీగా పెంపు: లీటర్‌పై రూ.3కు పైనే వాత.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

పెట్రోల్, డీజిల్‌ రేట్లు భారీగా పెంపు: లీటర్‌పై రూ.3కు పైనే వాత.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇంధన రేట్లను భారీగా పెంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమౌతోంది. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఏకంగా రూ.3 వడ్డించింది. 

ఈ మేరకు కర్ణాటకలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ పెంచినట్లు కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తక్షణమే ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పెట్రో రేట్లను సవరించినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ వెల్లడించింది.
Join WhatsApp Channel