పవిత్రమైన కార్తీకమాసం నవంబర్ 2, 2024 శనివారం నుండి మొదలు అవుతుంది. కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో
- న కార్తీక నమో మాసః
- న దేవం కేశవాత్పరం
- నచవేద సమం శాస్త్రం
- న తీర్థం గంగాయాస్థమమ్
అని పేర్కొన్నారు. దీని అర్ధం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం ఈ లోకంలోనే లేదని అంటారు. శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.
కార్తీకమాసం విశేష తిథులు
తేదీ | విశేషం |
శు.విదియ – 3 నవంబర్ 2024 (ఆది) | భగినీ హస్త భోజనము, యమ ద్వితీయ, ధన్వంతరీ ద్వితీయ, గోవర్ధన పూజ |
శు.చవితి – 5 నవంబర్ (మంగళ) | నాగ చతుర్థి (నాగుల చవితి) |
శు.దశమి – 11 నవంబర్ (సోమ) | యాజ్ఞ్యవల్క్య జయంతి |
శు.ఏకాదశి – 12 నవంబర్ (మంగళ) | ప్రబోధినీ ఏకాదశి |
శు.ద్వాదశి – 13 నవంబర్ (బుధ) | క్షీరాబ్ది ద్వాదశి, తులసీ పూజ, చిలుకు ద్వాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి |
శు.త్రయోదశి – 14 నవంబర్ (గురు) | ప్రదోష వ్రతం |
పూర్ణిమ – 15 నవంబర్ (శుక్ర) | కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం, శ్రీ సత్యనారాయణ పూజ |
బ.చవితి – 19 నవంబర్ (మంగళ) | సంకష్టహర చతుర్థి |
బ.ఏకాదశి – 26 నవంబర్ (మంగళ) | ఉత్థాన ఏకాదశి |
బ.త్రయోదశి – 29 నవంబర్ (శుక్ర) | మాస శివరాత్రి |
అమావాస్య – 1 డిసెంబర్ (ఆది) | అమావాస్య |