Dasara at Viyajawada 2024: విజయవాడ ఇంద్రకీలాద్రి పై రోజు వారి అమ్మవారి అలంకారాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో తేది:03-10-2024 నుండి తేది:12-10-2024 వరకు జరుగు శ్రీ అమ్మవారి 10 విశేష అలంకరణ వివరములు మరియు దర్శన వేళలు, దర్శన సమయం

తేదీ , వారం దర్శన సమయంతిథిఅమ్మవారి అలంకారం
03-10-2024 Thursday
9 AM to 11 PM
ఆశ్వీయుజ శుద్ధ
పాడ్యమి
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
04-10-2024 Friday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
విధియ
శ్రీ గాయత్రి దేవి
05-10-2024 Saturday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
తధియ
శ్రీ అన్నపూర్ణా దేవి
06-10-2024 Sunday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
చవితి
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
07-10-2024 Monday 4 AM to 11 PMఆశ్వీయుజశుద్ద పంచమిశ్రీ మహా చండీ దేవి
08-10-2024 Tuesday 4 AM to 11 PMఆశ్వీయుజశుద్ద పంచమి / షష్టిశ్రీ మహాలక్ష్మీ దేవి
09-10-2024 Wednesday 3 AM to 11 PMశ్రీ సరస్వతీ దేవి
మధ్యాహ్నం 2.00 గం.ల
నుండి 3.00
గం.ల
మధ్యలో గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వము తరపున
పట్టు వస్త్రములు
సమర్పించబడును.
10-10-2024 Thursday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
అష్టమి
శ్రీ దుర్గా దేవి
11-10-2024 Friday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
అష్టమి/నవమి
(మహర్నవమి)
శ్రీ మహిషాశురమర్దిని దేవి
12-10-2024 Saturday 4 AM to 11 PMఆశ్వీయుజ శుద్ధ
దశమి
(విజయదశమి)
శ్రీ రాజరాజేశ్వరి దేవి

మహానీవేదన మరియు పంచహారతులు:

తేదీ:03.10.2024 నుండి 11.10.2024 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6.30 ని.ల నుండి 7.30 ని.ల వరకు శ్రీ అమ్మవారి మహానీవేదన మరియు పంచహారతులు నిమిత్తం భక్తులకు అన్ని దర్శనములు నిలుపుదల చేయబడును.

అంతరాలయ దర్శనము నిలుపుదల:

  1. తేదీ:03.10.2024 నుండి 12.10.2024 వరకు మరియు 13.10.2024 & 14.10.2024 తేదీలలో భవానీ భక్తులు అధిక సంఖ్యలో విచేయుదురు. కనుక అంతరాలయ దర్శనములు నిలుపుదల చేయబడును.
  2. ఈ దసరా ఉత్సవములలో ప్రతి రోజు సుమారుగా ఒక లక్షకు పైగా భక్తులు అమ్మవారి దర్శనమునకు విచ్చేయుదురు.
    మూలానక్షత్రము రోజున సుమారు 1,50,000 నుండి 2,00,000 మంది భక్తులు విచ్చేయుదురు. తదుపరి తెప్పోత్సవము రోజున 1.00 లక్ష నుండి 1.50 లక్షల వరకు భక్తులు వచ్చెదరు. వీరికి సక్రమముగా దర్శనము మొదలగునవి అగునట్లుగా తగు చర్యలు తీసుకొనబడును.
  3. రూ.100/-లు మరియు రూ.300/-లు మరియు రూ.500/- లు దర్శనము టిక్కెట్లను భక్తులకు కౌంటర్ల నందు టిక్కెట్లు జారీ చేయబడును.
  4. 03.10.2024 నుండి 14.10.2024 వరకు అంతరాలయ దర్శనము ఉండదు.
  5. భక్తులు ఎవరైననూ పున్నమి ఘాట్ వద్ద దర్శనము టిక్కెట్టు వారిని మరియు పూజ టిక్కెట్లు ఉన్న వారిని సమయానుకూలమును బట్టి బస్సు ద్వారా కొండపైకి ఓమ్ టర్నింగ్ వరకు వచ్చుటకు ఏర్పాటు చేయబడును.
Join WhatsApp Channel