ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించిన
ఏపీ ఈసెట్-2024 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11
గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అనంతపురం
జెఎన్‌టియు నూతన పరిపాలన భవనంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా
జెఎన్‌టియు వైస్‌ఛాన్స్‌లర్, ఏపీ.ఈసెట్ ఛైర్మన్ జివిఆర్ శ్రీనివాసరావు,
ఈసెట్ కన్వీనర్ పిఆర్.భానుమూర్తి మంగళవారం నాడు జెఎన్‌టియులో
విలేకరులతో మాట్లాడారు.
ఏపీ ఈ సెట్ పరీక్ష 14 కేంద్రాల్లో
నిర్వహించామన్నారు. ఈ నెల 10న ప్రశ్నాపత్రం ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉంచామన్నారు. కీపై అభ్యంతరాలను ఈ నెల 12వ తేదీ వరకు
స్వీకరించామన్నారు. అభ్యంతరాలను పరిశీలించి నిపుణుల సూచనల మేరకు తుది కీ
మేరకు ఫలితాలు సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ ఉదయం 11గంటలకు
ఫలితాలను అనంతపురం జెఎన్‌టియులో విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.