AP Dasara Holidays 2024: స్కూళ్లకు దసరా సెలవులు ఇచ్చేశారు .. వివరాలివే

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల పాటు సెలవులుంటాయి.అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి (Gandhi Jayanti) కూడా సెలవు కావడంతో ఆ రోజు నుంచే విద్యా సంస్థలకు Dasara Holidays మొదలవుతాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంక్రాంతి, క్రిస్మస్ సెలవుల విషయంలో మాత్రమే ఆయా స్కూళ్లకు వ్యత్యాసం ఉంటుంది. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఇస్తారు. మిగతా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకు 11 రోజులు, సంక్రాంతికి 9 రోజుల సెలవులు ఉంటాయి.

సెలవుల తర్వాత అక్టోబర్ 14వ తేదీన తిరిగి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం (సెప్టెంబర్‌ 27) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Join WhatsApp Channel