ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు మొదలైంది. మొదటి విడతలో సీట్లు దక్కనివారు .. వచ్చిన సీట్లతో సంతృప్తి చెందని వారు ఈ తుది విడత కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చు. ఈ కౌన్సెలింగ్ కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 25 తేదీతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన కూడా మొదలైంది .. ఇది ఈ నెల 26 తో ముగుస్తుంది. రేపటి నుంచి 26 తేదీ వరకు అభ్యర్ధులు కాలేజీల ఎంపికను ఆన్లైన్ లో చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జులై 30 న విడుదల అవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఆగస్టు 3 వరకు కాలేజీల్లో జాయిన్ అవడానికి షెడ్యూల్ ఇచ్చారు.
కాగా మొదటి విడత కౌన్సెలింగ్ లో దాదాపు 85.71% శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,36,660 సీట్లకు 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయి అని కన్వీనర్ ప్రకటించారు. మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయ్యాక ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో స్పాట్ అడ్మిషన్లు అలాగే మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తి అవుతుంది.
చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలైనట్లు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ లు చెప్పారు.