తెలంగాణలో జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగబోయే పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు TS SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/
నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయుల యూజర్ ఐడీ,
పాస్‌వర్డ్ తో లాగిన్ అయ్యి స్కూల్ వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
TS SSC Supplementary Timetable 2024 పరీక్షల టైమ్ టేబుల్ ఇలా
- జూన్ 3- ఫస్ట్ లాంగ్వేజ్, కంపోజిట్ పేపర్ 1, కంపోజిట్ కోర్సుల పరీక్షలు(కంపోజిట్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు)
- జూన్ 5- సెకండ్ లాంగ్వేజ్
- జూన్ 6 – థర్డ్ లాంగ్వేజ్
- జూన్ 7 – మ్యాథ్స్
- జూన్ 8- ఫిజికల్ సైన్స్
- జూన్ 10 – బయాలజీ
- జూన్ 11 – సోషల్
- జూన్ 12 – ఓరియంటల్ సబ్జెక్టు పేపర్ 1( సంస్కృతం, అరబిక్)
- జూన్ 13 – ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్ 2