ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం …

 *ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు పచ్చి కరివేపాకు ఆకులను తినవచ్చు. పుదీనా, కొత్తిమీర,తులసి,కరివేపాకు,పాలకూర లాంటి వాటితో juice చేసుకుని తాగవచ్చు..

* నువ్వులు, వేరుశనగ గుండ్లు, రాగులు, కొబ్బరి, మంచి (ఆర్గానిక్ )బెల్లం(తాటిబెల్లం, నాటుబెల్లం) తో లడ్లు చేసుకొని వారానికి రెండు సార్లు తీసుకోవాలి.

* జావ/అంబలి 

ఉదయం రాగి, సజ్జలు మరియు జొన్నలు / అంబలి / జావా గా తీసుకోవడం మంచిది.

సిరిధాన్యాల అంబలి కూడా తీసుకోవచ్చు..

* వేరుశెనగ గింజలను రాత్రిపూట నానబెట్టడం మరియు దానిని పొద్దున్నే తినడం మంచిది.

* క్రింది చిరు ధాన్యాలు రోజూ ఆహారంగా  తీసుకోవాలి. 

ఊదలు 

అరికలు 

కొర్రలు 

అండు కొర్రలు 

సామలు 

*మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.

*Note: వీటిలో మీకు ఏదైనా గిట్టకపోతే గిట్టినవి మాత్రమే తినవచ్చు

* రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలు మరియు పోలిష్ చేయని దేశీబియ్యం తో చేసుకోవాలి.

*ప్రతిరోజూ కనీసం గంట పరిగెత్తాలి… చేయలేనివారు జాగింగ్ చేయాలి… అదీ చేయలేనివారు brisk walk చేయాలి… అదీ చేయలేనివారు normal walking చేయాలి…

*సాధ్యమైనంతవరకు ఏసీ లను వాడకండి. కనీసం వారానికొకసారి పొలాలు/లేదా ప్రకృతిలో కనీసం ఒక పూట గడపండి.

*ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి. ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయండి. చేయలేని వారు చైర్ సూర్యనమస్కారాలు చేయండి.

* సాయంత్రం పూట snacks గా ఉలవలు, శెనగలు, పెసలు, బొబ్బర్లు(అలచందలు) లాంటివి గుగ్గిళ్లు గా తినవచ్చు.

* ప్రతిరోజూ 3/4 లీటర్ల నీటిని తాగండి

*ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి

Join WhatsApp Channel