World Lung Cancer Day: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలు.. కారణాలు.. నివారణ

ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. అలాగే క్యాన్సర్లలో కెల్లా తీవ్రమైంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌. దీన్నే లంగ్ కాన్సర్ అని కూడా అంటారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షణాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో ఎక్కువగా కనిపించే అయిదు క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. మన దేశంలోని క్యాన్సర్ల కేసులలో దాదాపు 6 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది దాదాపు లక్షమంది ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణాలు, నివారణ, చికిత్స వివరాలు చూద్దాం.​

lung-cancer
lung-cancer

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడానికి ప్రధానంగా..

  • పొగతాగే అలవాటు
  • కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ
  • వాయు కాలుష్యం
  • రాళ్లు, మట్టి పగుళ్ల నుంచి బయటకు వచ్చే రాడన్‌ గ్యాస్‌

ఎలా గుర్తించాలి

ఊపిరితిత్తుల క్యాన్సర్లను సాధారణంగా మూడు రకాలుగా పిలుస్తారు. స్మాల్ సెల్, నాన్-స్మాల్ సెల్, మరియు లంగ్ కేర్సినోయిడ్ ట్యూమర్. నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది ఇతర రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లలో చాలా ఎక్కువగా కనిపించే రకం.

ఇక లక్షణాలను చూస్తే

దగ్గు
నోటి నుంచి రక్తం రావడం
ఛాతీ నొప్పి
బరువు తగ్గడం
అలసట
ఎముకల్లో నొప్పులు ఉంటాయి.

వైద్యులు ఒక చెస్ట్ ఎక్స్-రే, CT స్కాన్ లేదా PET-CT స్కాన్, బ్రోంకోస్కోపీ, క్రమానుగత రక్త పరీక్షలు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్­ని విశ్లేషించడానికి స్పైరోమీటర్­ని ఉపయోగిస్తారు.

నివారణ

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఊపిరితిత్తి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. ఆరుబయట వ్యాయామం చేయటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది కూడా.

Join WhatsApp Channel